సంగీతం::G.K.వెంకటేష్
రచన::దాశరథి
గానం::S.జానకి,రమణ
తారాగణం::కృష్ణ,జమున,రామకృష్ణ,చంద్రకళ,నిర్మల,సునందిని (నూతన పరిచయం)
పల్లవి::
పిలిచిన పలికే దేవుడివయ్యా..వెంకటేశ్వరా
పిలిచిన పలికే దేవుడివయ్యా..వెంకటేశ్వరా
దీనుల కాచి తోడుగ నిలచీ..దారిచూపరా..ఆఆ
జాలిచూపరా..స్వామీ..జాలిచూపరా
పిలిచిన పలికే దేవుడివయ్యా..వెంకటేశ్వరా
చరణం::1
కన్నతల్లియే కరువై పోయిన..చిన్నవాడురా
తండ్రి ప్రేమకై రేయీ పగలూ..తల్లడిల్లెరా
కన్నతల్లియే కరువై పోయిన..చిన్నవాడురా
తండ్రి ప్రేమకై రేయీ పగలూ..తల్లడిల్లెరా
లేతమనసులో మూగవేదనా..ఆలకించరా
స్వామీ..ఆదరించరా
పిలిచిన పలికే దేవుడివయ్యా..వెంకటేశ్వరా
ఈ దీనులకాచి తోడుగనిలచీ..దారిచూపరా
జాలిచూపరా..స్వామీ..జాలిచూపరా
చరణం::2
ఏడుకొండల శిఖరం మీద..ఉన్న దేవుడా
నాన్నగుండెలో కాసేపైన..ఉండగూడదా..ఆ
ఏడుకొండల శిఖరం మీద..ఉన్న దేవుడా
మా నాన్నగుండెలో కాసేపైన..ఉండగూడదా
మనసును మార్చి..మమతలు పెంచి
మమ్ము కలపరా నీలో..మహిమ చూపరా
పిలిచిన పలికే దేవుడివయ్యా..వెంకటేశ్వరా
ఈ దీనుల కాచి తోడుగ..నిలచీ దారి చూపరా
జాలిచూపరా..స్వామీ..జాలిచూపరా
పిలిచిన పలికే దేవుడివయ్యా..వెంకటేశ్వరా
No comments:
Post a Comment