సంగీతం::G.K.వెంకటేష్
రచన::ఆరుద్ర
గానం::S.P.బాలు,P.సుశీల
తారాగణం::కృష్ణ,జమున,రామకృష్ణ,చంద్రకళ,నిర్మల,సునందిని-నూతన పరిచయం
పల్లవి::
అరెరెరె..ఆహా..హాహాహా
ఆరుమాసాలాగు..పుడతాడు మనకోబాబు
ఆరుమాసాలాగు..పుడతాడు మనకోబాబు
కనువిందుగా..ఇక పండుగా
ఆగనని అన్నానా..ఆగడం చేశానా
ఆగనని అన్నానా..ఆగడం చేశానా
మగవారికే..మహతొందరా
ఓ..ఆరుమాసాలాగు..పుడతాడు మనకోబాబు
చరణం::1
అందం చిందే బాబే..ముద్దులమూటా
అప్పుడు నువ్వు..ఎంచవులే నామాటా
అందం చిందే బాబే..ముద్దులమూటా
అప్పుడు నువ్వు..ఎంచవులే నామాటా
నేడు దొరగారూ..వెంటపడతారూ
నేడు దొరగారూ..వెంటపడతారూ
రెపు మీ బాబే..లోకమంటారూ
పాపాయికే గిలిగింతలు..లాలింపులు
ఆరుమాసాలాగు..పుడతాడు మనకోబాబు
చరణం::2
నువు కానుక ఇచ్చే బంగరుకొండ..ఎలాగ ఉంటాడో
నువు కానుక ఇచ్చే బంగరుకొండ..ఎలాగ ఉంటాడో
కన్నూ ముక్కూ మాట మనసూ..మీలా వుంటాడూ
కన్నూ ముక్కూ మాట మనసూ..మీలా వుంటాడూ
నిండినవి నెలలూ..పండును ఇక కలలూ
నిండినవి నెలలూ..పండును ఇక కలలూ
నేటి తొలిచూలూ..రేపు మురిపాలూ
నా ఆశలు నా బాసలు..తీరేనులే
మ్మ్..ఆరుమాసాలాగు..పుడతాడు మనకోబాబు
కనువిందుగా..ఇక పండుగా
ఆగనని అన్నానా..ఆగడం చేశానా
మహారాణికే..ఈ తొందరా
ఆరుమాసాలాగు..పుడతాడు మనకోబాబు
No comments:
Post a Comment