సంగీతం::J.V.రాఘవులు
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::P.సుశీల
తారాగణం::శోభన్‌బాబు, వాణిశ్రీ, గుమ్మడి, కృష్ణంరాజు, లక్ష్మి, చంద్రమోహన్
పల్లవి::
మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్
పుట్టిన రోజు పండగే అందరికీ
మరి పుట్టింది ఎందుకో తెలిసేది ఎందరికి
పుట్టిన రోజు పండగే అందరికీ
మరి పుట్టింది ఎందుకో తెలిసేది ఎందరికి
ఎందరికి..ఎందరికి
చరణం::1
కలిమికేమి వలసినంత వున్నా
మనసు చెలిమి కొరకు..చేయి సాచుతుంది
ఆ మనసే ఎంత..పేదదైనా..aa
అనురాగపు సిరులు..పంచుతుంది
మమత కొరకు తపియించే..జీవనం
మమత కొరకు తపియించే..జీవనం
దైవ మందిరంలా..పరమ పావనం
పుట్టిన రోజు పండగే అందరికీ
మరి పుట్టింది ఎందుకో తెలిసేది ఎందరికి
ఎందరికి..ఎందరికి
చరణం::2
పువ్వెందుకు తీగపై..పుడుతుంది ?
జడలోనో గుడిలోనో..నిలవాలని!
ముత్యమేల కడలిలో..పుడుతుంది ?
ముచ్చటైన హారంలో..మెరవాలని!
ప్రతి మనిషీ తన జన్మకు..పరమార్థం తెలుసుకుని
తన కోసమే కాదు..పరుల కొరకు బతకాలి
తన కోసమే కాదు..పరుల కొరకు బతకాలి
తానున్నా లేకున్నా..తానున్నా లేకున్నా..తన పేరు మిగాలి
పుట్టిన రోజు పండగే అందరికీ
మరి పుట్టింది ఎందుకో తెలిసేది ఎందరికి
ఎందరికి..ఎందరికి
No comments:
Post a Comment