సంగీతం::రమేష్ నాయుడు
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::P. సుశీల
తారాగణం::శోభన్‌బాబు,శారద,జయంతి,కృష్ణంరాజు,నాగయ్య,రమణారెడ్డి,జ్యోతిలక్ష్మి
పల్లవి::
చిన్నారి ఓ బాబూ..బలే బలే బాబూ..వరాల బాబు
అమ్మా నాన్నా దీవనలంది..వర్థిల్లాలి అల అల నవ్వు
చిన్నారి ఓ బాబూ..బలే బలే బాబూ..వరాల బాబు
హో..బలే బలే బాబూ..వరాల బాబు
చరణం::1
మీ అమ్మ మోము చూడ..మిసిమినవ్వు విరిసేను మిసిమినవ్వు విరిసేను
మీ నాన్న కళ్ళు చూడ..ముత్యాలై మెరిసేను ముత్యాలై మెరిసేను
ఆఆఆ..నవ్వుల పువ్వుగా..ఆఆఆ..కన్నుల దెవ్వెగా
ఉదయించిన నిన్నుగని నా మనసే మురిసేను
మ్మ్ హూ అహా అహా ఓ హో హో మ్మ్ హూ మ్మ్ హూ
చిన్నారి ఓ బాబూ..బలే బలే బాబూ..వరాల బాబు
హో..బలే బలే బాబూ..వరాల బాబు
చరణం::2
బాబూ నిన్నెత్తుకుంటే..పసిడికొండనౌతాను పసిడికొండనౌతాను
పాపా నిను హత్తుకుంటే..పాలవెల్లినౌతాను పాలవెల్లినౌతాను
పాపా నిను హత్తుకుంటే..పాలవెల్లినౌతాను పాలవెల్లినౌతాను
మీ ఇద్దరూ వుండగా..నా ముద్దులు పండగా
ఏ తల్లీ పొందలేని ఆనందం..పొందేను
మ్మ్ హూ అహా అహా ఓ హో హో మ్మ్ హూ మ్మ్ హూ
చిన్నారి ఓ బాబూ..బలే బలే బాబూ..వరాల బాబు
అమ్మా నాన్నా దీవనలంది వర్థిల్లాలి..అల అల నవ్వు
చిన్నారి ఓ బాబూ..బలే బలే బాబూ..వరాల బాబు
No comments:
Post a Comment