Thursday, September 09, 2010

జీవితం--1973


















సంగీతం::రమేష్ నాయుడు
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::P.సుశీల,రామకృష్ణ
తారాగణం::శోభన్‌బాబు,శారద,జయంతి,కృష్ణంరాజు,నాగయ్య,రమణారెడ్డి,జ్యోతిలక్ష్మి

పల్లవి::

ఓఓఓఓ ఓహో..అహా..ఆఆ..అహా..ఒహోహో..ఆఆఆ అహా 
ఇక్కడే కలుసుకొన్నాము..ఎప్పుడో కలుసుకున్నాము
ఏ జన్మలోనో..ఏ జన్మలోనో..ఎన్నెన్ని జన్మలలోనో 
ఇక్కడే కలుసుకొన్నాము..ఎప్పుడో కలుసుకున్నాము

చరణం::1

నీలనీల గగనాల మేఘ..తల్పాలప్తెన 
పారిజాత సుమసౌరభాల..కెరటాలలోన 
నీచేయి నా పండువెన్నెల..దిండుగా 
నీ రూపమే నా గుండెలో..నిండగా   
కలలన్నీ వడబోసి..కలలన్నీ వడబోసి 
కౌగిలిలో చవిచూసి..
ఇక్కడే కలుసుకొన్నాము..ఎప్పుడో కలుసుకున్నాము

చరణం::2

నాటిజన్మలో ఓ చెలీ..నా చరణాలవ్రాలి ఎమన్నావు?  
జన్మజన్మలకు నా స్వామీ..నీ చరణదాసినని అన్నాను
అంతలో నిను చేరదీసి..మరి నేనేమన్నాను
ఓ సఖీ నా ఊపిరిలోనే..వున్నావని అన్నావు
ఆనాటి అనుబంధం..యీనాటి మనబంధం 
ఆనాటి అనుబంధం..యీనాటి మనబంధం
ఇక్కడే కలుసుకొన్నాము..ఎప్పుడో కలుసుకున్నాము 

No comments: