Thursday, September 09, 2010

జీవన తరంగాలు--1973
























సంగీతం::J.V. రాఘవులు
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::ఘంటసాల
తారాగణం::శోభన్‌బాబు, వాణిశ్రీ, గుమ్మడి, కృష్ణంరాజు, లక్ష్మి, చంద్రమోహన్ 

పల్లవి::

ఉడతా ఉడతా హూత్
ఎక్కడికెళతావ్ హూత్ 
కొమ్మ మీది జాంపండు
కోసుకొస్తావా..బేబీకిస్తావా     
ఉడతా ఉడతా హూత్ 
ఎక్కడికెళతావ్ హూత్
కొమ్మ మీది..జాంపండు
కోసుకొస్తావా..మా..బేబీకిస్తావా

చరణం::1
     
చిలకమ్మా..ఓ చిలకమ్మా
చెప్పేది కాస్తా  వినవమ్మా
చిలకమ్మా..ఓ చిలకమ్మా
చెప్పేది కాస్తా  వినవమ్మా
నీ పంచదార పలుకులన్నీ
బేబీకిస్తావా..మా..బేబీకిస్తావా
   
ఉడతా ఉడతా హూత్ 
ఎక్కడికెళతావ్ హూత్
ఉడతా ఉడతా హూత్
ఎక్కడికెళతావ్ హూత్    

చరణం::2

ఉరకలేసే ఓ జింకా
పరుగులాపవె నీవింకా
ఉరకలేసే ఓ జింకా
పరుగులాపవె నీవింకా
నువు నేర్చుకున్న పరుగులన్నీ  
నువు నేర్చుకున్న పరుగులన్నీ 
బేబీకిస్తావా..మా..బేబీకిస్తావా 
  
ఉడతా ఉడతా హూత్ 
ఎక్కడికెళతావ్ హూత్ 
ఉడతా ఉడతా హూత్ 
ఎక్కడికెళతావ్ హూత్    

చరణం::3
   
చిలకల్లారా..కోకిలలారా  
చెంగున దూకే..జింకల్లారా 
చిలకల్లారా..కోకిలలారా   
చెంగున దూకే..జింకల్లారా 
చిన్నరి..పాపలముందు 
మా చిన్నరి..పాపలముందు
మీరెంత..మీ జోరేంత  
మీరెంత..మీ జోరేంత  

ఉడతా ఉడతా హూత్ 
ఎక్కడికెళతావ్ హూత్  
ఉడతా ఉడతా హూత్
ఎక్కడికెళతావ్ హూత్

No comments: