సంగీతం::సత్యం
రచన::D.C. నారాయణరెడ్డి
గానం::సుజాత,S.P.బాలు
తారాగణం::మురళీ మోహన్,గిరిబాబు,సునందిని,విజయ, విజయలలిత,రాజబాబు
పల్లవి::
నీమదిలో నేనే వుంటే..వుంటే
నా ఒడిలో నీవే వుంటే..వుంటే
నీమదిలో నేనే వుంటే..
నా ఒడిలో నీవే వుంటే
గుండెల్లో వలపుల మల్లి..గుబాళించిపోదా
నీమదిలో నేనే వుంటే
నా ఒడిలో నీవే వుంటే
బ్రతుకంతా తీయని తలపుల
బంతులాట..కాదా
నీమదిలో నేనే వుంటే..వుంటే
చరణం::1
అటు పచ్చని పచ్చికవుంటే
ఇటు వెచ్చని నెచ్చెలివుంటే
అటు పచ్చని పచ్చికవుంటే
ఇటు వెచ్చని నెచ్చెలివుంటే
కౌగిలిలో కన్నెవయసే
కాగి కాగి వేగిపోతుంటే..ఉంటే
ప్రతి నిమిషం భలే రుచికాదా
ప్రతి నిమిషం భలే రుచికాదా
నీమదిలో నేనే వుంటే
నా ఒడిలో నీవే వుంటే
గుండెల్లో వలపుల మల్లి
గుబాళించిపోదా
నీమదిలో నేనే వుంటే..వుంటే
చరణం::2
కొండవాగు దూకుతుంటే
కొంటెకోర్కె రేపుతుంటే
కొండవాగు దూకుతుంటే
కొంటెకోర్కె రేపుతుంటే
ఇద్దరమూ తరగలమాటున
నురగలచాటున ఏకమౌతుంటే..ఉంటే
ప్రతినిమిషం మరో రుచికాదా
నీమదిలో నేనే వుంటే
నా ఒడిలో నీవే వుంటే
బ్రతుకంతా తీయనితలపుల
బంతులాట కాదా
నీమదిలో నేనే వుంటే..వుంటే
No comments:
Post a Comment