సంగీతం::పెండ్యాల నాగేశ్వర రావు,
రచన::పింగళి నాగేంద్ర రావు
గానం::మంగళంపల్లి బాల మురళీకృష్ణ, S. జానకి
రాగం::మలయ మారుతం
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
వసంత గాలికి వలపులు రేగ వరించు బాలిక మయూరి కాగ
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
వసంత గాలికి వలపులు రేగ వరించు బాలిక మయూరి కాగ
తనువు మనసు ఊగి తూగి ఒక మైకం కలిగేనులే
తనువు మనసు ఊగి తూగి ఒక మైకం కలిగేనులే
ఈ మహిమ నీదేనులే..ఆ ఆ..ప్రేమతీరు ఇంతేనులే
ఈ మహిమ నీదేనులే...
రవంత సోకిన చల్లని గాలికి మరింత కోరిన వసంతుడనగా
రవంత సోకిన..చల్లని గాలికి మరింత కోరిన వసంతుడనగా
తనువు మనసు ఊగి తూగి..తనువు మనసు ఊగి తూగి
ఈ లోకం మారేనులే..ఏ..ఏ..ఏ..
ఈ మహిమ నీదేనులే..ఆ ఆ..ఆహా భలే హాయిలే
ఈ మహిమ నీదేనులే
విలాస మాధురి వెన్నెల కాగా విహార వీణలు విందులు కాగా
విలాస మాధురి..వెన్నెల కాగా విహార వీణలు విందులు కాగా
ఏకాంతంలో నీవూ నేనే..ఏకాంతంలో నీవూ నేనే
ఒక స్వర్గం కనుపించెనే..ఏ..ఏ..ఏ..
ఈ మహిమ నీదేనులే..ఆ ఆ ఆ..ప్రేమ తీరు ఇంతేనులే
ఈ మహిమ నీదేనులే...
No comments:
Post a Comment