Thursday, September 08, 2011

జగమే మాయ--1973




సంగీతం::సత్యం
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::S.జానకి
తారాగణం::మురళీ మోహన్,గిరిబాబు,సునందిని,విజయ, విజయలలిత,రాజబాబు 

పల్లవి::

మూగతనం మానుకో..దొరబాబూ
బేలతనం వదులుకో..చినబాబూ
నవ్వగలిగిందే మనసోయ్..బాబూ
నడవగిలిగిందే బ్రతుకోయ్..బాబూ

మూగతనం మానుకో..దొరబాబూ
బేలతనం వదులుకో..చినబాబూ
నవ్వగలిగిందే మనసోయ్..బాబూ
నడవగిలిగిందే బ్రతుకోయ్..బాబూ
తెలిసిందా..ఆ..మా..బాబూ

చరణం::1

మువ్వల్లే గలగల..మోగిపో
చిలిపి గువ్వల్లే అలా అలా..సాగిపో 
మువ్వల్లే గలగల..ఆ..మోగిపో
చిలిపి గువ్వల్లే అలా అలా..సాగిపో 
పిల్లగాలినడిగి అల్లరినేర్చుకో
నీలిమబ్బునడిగి మమతలెన్నో..కూర్చుకో
తెలిసిందా..ఆ..మా..బాబూ

మూగతనం మానుకో..దొరబాబూ
బేలతనం వదులుకో..చినబాబూ
నవ్వగలిగిందే మనసోయ్..బాబూ
నడవగిలిగిందే బ్రతుకోయ్..బాబూ

చరణం::2

కలలెన్నో నీకోసం..కాచుకున్నాయి
అవిపండాలని మా కళ్ళు..వేచి వున్నాయి 
కలలెన్నో నీకోసం..కాచుకున్నాయి
అవిపండాలని మా కళ్ళు..వేచి వున్నాయి
చీకటిని చిలకాలి..వెన్నెలే తీయాలి
వెన్నెల్లో మాబాబు..నూరేళ్ళు గడపాలి
తెలిసిందా..ఆ..మా..బాబూ

మూగతనం మానుకో..దొరబాబూ 
బేలతనం వదులుకో..చినబాబూ 
నవ్వగలిగిందే మనసోయ్..బాబూ
నడవగిలిగిందే బ్రతుకోయ్..బాబూ

No comments: