సంగీతం::పెండ్యాల నాగేశ్వర రావు,
రచన::పింగళి నాగేంద్ర రావు
గానం::ఘంటసాల,S.జానకి
ఆభేరి::రాగం
(భీం పలాశ్రీ)
ఆమె:- కుశలమా..కుశలమా..కుశలమా..
ఎటనుంటివో ప్రియతమా..
నీ విలాసము..నీ ప్రతాపము కుశలముగా..సిరి సిరి..
ఆమె:- నను నీవు..నిను నేను..తనివితీరగా..తలచుకొనీ..
నను నీవు..నిను నేను..తనివితీరగా తలచుకొనీ
పెనగొను ప్రేమలు విరిసికొనీ తనువులు మరచేమా..ఆ ఆ ఆ
అతడు:- కుశలమా..కుశలమా..ఎటనుంటివో ప్రియతమా..
నీ పరువము నీ పరవశమూ కుశలముగా..సిరి సిరీ..
అతడు:- కలలోనూ..మదిలోనూ..ఓ..పిలచినటులనే ఉలికిపడీ..
కలలోనూ..మదిలోనూ..ఓ..పిలచినటులనే ఉలికిపడీ
ఉల్లము విసిరే..వలపుగాలిలో మెల్లగకదిలేమా..ఆ..ఆ ఆ
ఆమె:- కుశలమా..కుశలమా..కుశలమా..
ఎటనుంటివో ప్రియతమా..
నీ విలాసము..నీ ప్రతాపము కుశలముగా..సిరి సిరి..
ఆమె:- కొలనిటనైనా కనుపించగనే ..ఏ ఏ ఏ
తలతువా నీ విజయేశ్వరినీ
కొలనిటనైనా కనిపించగనే
తలతువా నీ విజయేశ్వరినీ
అతడు:- కలగానముతో నీ చెలినేనని నాలో నిలీచితివే...
ఇద్దరు:- కుశలమా..కుశలమా..కుశలమా..
ఎటనుంటివో ప్రియతమా..కుశలమా..
2 comments:
శక్తి, ఎంత కాకతాళీయం అంటే, నిన్ననే నా పాత సీడీలో ఈ పాట విన్నాను. ఎంత ఆలోచించినా గుర్తు రాలేదు. చాల చక్కని పాట. చిన్న సవరణలు: ఆఖరి చరణంలో "కనిపించగనే" కు బదులు "కనుపించగనే"; "విజయీశ్వరి" కు బదులు "విజయేశ్వరి", "చెలియెనని" కు బదులు "చెలినేనని" అని వుండాలి. చిన్న సూచన: చరణాలను, గాయనీ గాయకులను ఎవరు ఏ లైను లేదా చరణం పాడారో సూచిస్తే బాగుంటుంది. చాల ఓపికగా, చక్కగా పాటలను అందిస్తున్నందుకు ధన్యవాదాలు.
నమస్తే సూర్యనారాయణ గారు __/\__
అబ్భా మీరు పొగడురుంటే నాకు
హిమాలయపర్వతాలు ఎక్కినంత ఆనందంగా ఉంది
పాటలు ఇన్నప్పుడు నాకు కలిగిన ఈ ఆనందం
అందరితో పంచుకోవాలని చిన్న ఆశతో చేస్తున్న
ప్రయత్నం ఈ పాడుతా తీయగా చల్లగా
మీ అందరి ఆశీస్సుల బలంతో ఇంకా మంచి మంచి
పాటలు అందించాలనేదే నా కోరిక
మీరు చెప్పిన సవరణలు తప్పక మార్పులు చేస్తాను
ప్రేమతో
శక్తి
Post a Comment