Wednesday, September 07, 2011

గాంధీపుట్టినదేశం--1973



























సంగీతం::S.P.కోదండపాణి
రచన::దాశరథి
గానం::S.P.బాలు,P.సుశీల
తారాగణం::కృష్ణంరాజు,పద్మనాభం,రాజబాబు,జానకి,జయంతి,రమాప్రభ,నిర్మల

పల్లవి::

వలపే వెన్నెలగా..బ్రతుకే పున్నమిగా 
జతగా గడిపే చల్లనీ ఈ రేయీ  
ఎపుడూ ఇటులే నిలవాలి..ఈ కలలే నిజమై విరియాలి  
వలపే వెన్నెలగా..బ్రతుకే పున్నమిగా          

చరణం::1

అల్లరి గాలికి నేలకు రాలే మల్లెను దోసిట దాచావు 
అల్లరి గాలికి నేలకు రాలే మల్లెను దోసిట దాచావు
అనురాగముతో అల్లిన మాలగ నీ మెడలోనే నిలిపావు 
తోడూ నీడా అయినావు  
వలపే వెన్నెలగా..బ్రతుకే పున్నమిగా           

చరణం::2

సొగసూ మనసూ కానుక చేసి నాలో సగమై నిలిచావు 
సొగసూ మనసూ కానుక చేసి నాలో సగమై నిలిచావు 
చీకటి వెలుగులు చెరిసగము పంచుకునేవూ ఏనాడు 
ఎదలో ఎదగా ఒదిగావూ  

వలపే వెన్నెలగా..బ్రతుకే పున్నమిగా 
జతగా గడిపే చల్లనీ ఈ రేయీ  
ఎపుడూ ఇటులే నిలవాలి..ఈ కలలే నిజమై విరియాలి  
వలపే వెన్నెలగా..బ్రతుకే పున్నమిగా  

No comments: