Saturday, September 04, 2010

ప్రేమపక్షులు--1973::పీలు::రాగం





సంగీతం::అశ్వత్థామ
రచన::ఉషఃశ్రీ
గానం::K.J.ఏసుదాస్


రాగం:::పీలు

తెల్లారేదాకా నువ్వు తలుపు మూసి తొంగుంటే
తెల్లారేదాకా నువ్వు తలుపు మూసి తొంగుంటే
తగువెట్టా తీరేదీ తలుపు తీయవే భామా
తెల్లారేదాకా నువ్వు...

రేయంతా సల్లో ఒణికి రెప్పేయకుండా గడిపి
రేయంతా సల్లో ఒణికి రెప్పేయకుండా గడిపి
ఒళ్లంతా బరువైనాది కళ్లేమో ఎరుపైనాయి
ఒళ్లంతా బరువైనాది కళ్లేమో ఎరుపైనాయి
తెల్లారేదాకా నువ్వు తలుపు మూసి తొంగుంటే
తగువెట్టా తీరేదీ తలుపు తీయవే భామా
తెల్లారేదాకా నువ్వు...

సంగతంతా తెలిసిందంటే
సుట్టుపక్కలా నవ్వుతారు
సంగతంతా తెలిసిందంటే
సుట్టుపక్కలా నవ్వుతారు
సంకురేతిరి సల్లో కూడ బింకమేటని అంటారు
బింకమేటని అంటారు
తెల్లారేదాకా నువ్వు తలుపు మూసి తొంగుంటే
తగువెట్టా తీరేదీ తలుపు తీయవే భామా
తెల్లారేదాకా నువ్వు...

ఒద్దికగా నా ఒళ్లో ఒదిగి
ముద్దుముద్దుగా నను మురిపిస్తే
నీతోటే ఉంటాను నీ మాటే ఇంటాను
నీతోటే ఉంటాను నీ మాటే ఇంటాను
తెల్లారేదాకా నువ్వు తలుపు మూసి తొంగుంటే
తగువెట్టా తీరేదీ తలుపు తీయవే భామా
తెల్లారేదాకా నువ్వు...

No comments: