సంగీతం::K.V.మహాదేవన్
రచన::C.నారాయణ రెడ్డి
గానం::ఘంటసాల
పల్లవి::
విధి ఒక విషవలయం
విషాద కధలకు అది నిలయం
విషాద కధలకు అది నిలయం
విధి ఒక విషవలయం
చరణం::1
పూవు మాటున పొంచిన ముళ్ళు నాటే దాకా తెలియదు
కడలి కడుపున బడబానలము రగిలే దాకా తెలియదు
పచ్చని తరువు సుడిగాలి పాలై విరిగే దాకా తెలియదు
విధి ఒక విషవలయం
విషాద కధలకు అది నిలయం
విషాద కధలకు అది నిలయం
విధి ఒక విషవలయం
చరణం::2
కలలోనైనా ఎడబాటెరుగని కులసతి ఎంతగా వగచేనో
ఇన్నేళ్ళాయెను నాన్న ఏడని కూతురెంతగా వేచేనో
కలలోనైనా ఎడబాటెరుగని కులసతి ఎంతగా వగచేనో
ఇన్నేళ్ళాయెను నాన్న ఏడని కూతురెంతగా వేచేనో
గుండె చెరువుగా కుమిలిన మా యమ్మ పండుటాకులా మిగిలేనో
విధి ఒక విషవలయం
విషాద కధలకు అది నిలయం
విషాద కధలకు అది నిలయం
విధి ఒక విషవలయం
చరణం::3
చెట్టుకొకటిగా చెదరిన గువ్వలు చివరికి గూటికి చేరేనా
అంతులేని ఈ అజ్ఞాత వాసం ఏనాటికైనా తీరేనా
మమతలు నిండిన మా కాపురమే మళ్లి కళకళలాడేనా
మళ్లీ కళకళలాడేనా
MaatruDevata--1969
Music::K.V.Mahaadeva
Lyrics::C. Naaraayana Reddi
Singer::Ghantasala
:::
vidhi oka vishavalayam
vishada kadhalaku adi nilayam
vishada kadhalaku adi nilayam
vidhi oka vishavalayam
:::1
puvu matuna poochina mullu naate daakaa teliyadu
kadali kadupuna badabaanalamu ragile daakaa teliyadu
pachani taruvu sudigaali paalai virige daakaa teliyadu
vidhi oka vishavalayam
vishada kadhalaku adi nilayam
vishada kadhalaku adi nilayam
vidhi oka vishavalayam
:::2
kalalonainaa yedabaaterugani kulasati yentagaa vagacheno
innellaayenu nanna yedani kuturentagaa vecheno
kalalonainaa yedabaaterugani kulasati yentagaa vagacheno
innellaayenu nanna yedani kuturentagaa vecheno
gunde cheruvugaa kumilina ma yamma pandutaakulaa migileno..
vidhi oka vishavalayam
vishada kadhalaku adi nilayam
vishada kadhalaku adi nilayam
vidhi oka vishavalayam
:::3
chettukokatiga chedarina guvvaluchivariki gutiki cherenaa
antuleni ee ajnyata vasam yenatikainaa teerenaa
mamatalu nindina ma kapurame malli kalakalalaadena
malli kalakalalaadenaa
No comments:
Post a Comment