సంగీతం::K.V.మహాదేవన్
రచన::C. నారాయణ రెడ్డి
గానం::P.సుశీల
తారాగణం::N.T. రామారావు,సావిత్రి,శోభన్‌బాబు,చంద్రకళ,నాగభూషణం
పల్లవి::
కన్నియనుడికించ తగునా భ్రమరా
కన్నియనుడికించ తగునా భ్రమరా
అన్నెము పున్నెము ఎరుగని కలువల
కన్నియనుడికించ తగునా భ్రమరా
అన్నెము పున్నెము ఎరుగని కలువల
కన్నియనుడికించ తగునా భ్రమరా
చరణం::1
తీవియ ఒడిలో ఒదిగినది తేనెలు ఎదలో పొదిగినది
తీవియ ఒడిలో ఒదిగినది తేనెలు ఎదలో పొదిగినది
రేకులు విరిసి విరియనిది..రేకులు విరిసి విరియనిది
ఏ కన్ను సైగల పాపలెరుగనిది
కన్నియనుడికించ తగునా భ్రమరా
అన్నెము పున్నెము ఎరుగని కలువల
కన్నియనుడికించ తగునా
చరణం::2
గాలి సోకగా కలవర పడురా
అలలు కదలగా ఉలికులికి పడురా
గాలి సోకగా కలవర పడురా
అలలు కదలగా ఉలికులికి పడురా
అల చందమామను తిలకించగానే
నిలువెల్ల తొలి సిగ్గు గిలిగింతలిడురా
కన్నియనుడికించ తగునా
చరణం::3
మనసార పిలిచే పిలుపే పిలుపు
మనువులు కలిపే వలపే వలపు
మనసార పిలిచే పిలుపే పిలుపు
మనువులు కలిపే వలపే వలపు
వలపు లేని పరువపు సయ్యాటలు
వలపు లేని పరువపు సయ్యాటలు
సెలయేటి కెరటాల నురుగుల మూటలు
కన్నియనుడికించ తగునా భ్రమరా
అన్నెము పున్నెము ఎరుగని కలువల
కన్నియనుడికించ తగునా
Maatru Devata--1969
Music::K.V.Mahaadeva
Lyrics::C. Naaraayana Reddi
Singer::P.Suseela
:::
kanniyanudikincha tagunaa bhramaraa
kanniyanudikincha tagunaa bhramaraa
annemu punnemu erugani kaluvala
kanniyanudikincha tagunaa bhramaraa
annemu punnemu erugani kaluvala
kanniyanudikincha tagunaa bhramaraa
:::1
teeviya odilo odiginadi tenelu edalo podiginadi
teeviya odilo odiginadi tenelu edalo podiginadi
rekulu virisi viriyanidi..rekulu virisi viriyanidi
E kannu saigala paapaleruganidi
kanniyanudikincha tagunaa bhramaraa
annemu punnemu erugani kaluvala
kanniyanudikincha tagunaa
:::2
gaali sokagaa kalavara paduraa
alalu kadalagaa ulikuliki paduraa
gaali sokagaa kalavara paduraa
alalu kadalagaa ulikuliki paduraa
ala chandamaamanu tilakinchagaane
niluvella toli siggu giligintaliduraa
kanniyanudikincha tagunaa
:::3
manasaara piliche pilupe pilupu
manuvulu kalipe valape valapu
manasaara piliche pilupe pilupu
manuvulu kalipe valape valapu
valapu leni paruvapu sayyaatalu
valapu leni paruvapu sayyaatalu
selayeti kerataala nurugula mootalu
kanniyanudikincha tagunaa bhramaraa
annemu punnemu erugani kaluvala
kanniyanudikincha tagunaa
No comments:
Post a Comment