సంగీతం::J.V.రాఘవులు
రచన::దాసరినారాయణ రావ్
గానం::S.P.బాలు
శివరంజని::రాగం
పల్లవి::
జననీ జన్మ భూమిశ్చ
స్వర్గాదపీ గరీయసి స్వర్గాదపీ గరీయసి
ఏ తల్లి నిను కన్నదో..ఏ తల్లి నిను కన్నదో
ఆ తల్లినే కన్న భూమి గొప్పదిరా
జననీ జన్మ భూమిశ్చ
స్వర్గాదపీ గరీయసి స్వర్గాదపీ గరీయసి
చరణం::1
నీ తల్లి మోసేది నవమాసాలేరా
ఈ తల్లి మోయాలి కడవరకురా
కట్టే కాలే వరకురా....
ఆ ఋణం తలకొరివితో తీరేనురా
ఈ ఋణం ఏ రూపాన తీరేనురా
ఆ రూపమే ఈ జవానురా
త్యాగానికి మరో రూపు నువ్వురా
జననీ జన్మ భూమిశ్చ
స్వర్గాదపీ గరీయసి స్వర్గాదపీ గరీయసి
చరణం::2
గుండె గుండెకు తెలుసు గుండె బరువెంతో
ఆ గుండెకే తెలుసు గుండె కోత బాధేంటో
ఈ గుండె రాయి కావాలి
ఆ గుండెల్లో ఫిరంగులు మోగాలి
మనిషిగా పుట్టిన ఓ మనిషీ
మారాలి నువ్వు రాక్షసుడిగా
మనుషుల కోసం ఈ మనుషుల కోసం
ఈ మనుషుల కోసం
జననీ జన్మ భూమిశ్చ
స్వర్గాదపీ గరీయసి స్వర్గాదపీ గరీయసి
No comments:
Post a Comment