సంగీతం::చక్రవర్తి
రచన::వేటూరి
గానం::S.P.బాలు,P.సుశీల
తారాగణం::కృష్ణ,శ్రీదేవి,సత్యనారాయణ,నాగభూషణం,కాంతారావు,పండరీబాయి,
అల్లు రామలింగయ్య
పల్లవి::
నా జీవన బృందావనిలో..ఆమని ఉదయంలో
నిను చూసిన తొలి ఆశలు..విరబూసిన సమయంలో
నా జీవన బృందావనిలో..ఆమని ఉదయంలో
నిను చూసిన తొలి ఆశలు..విరబూసిన సమయంలో
కనిపించె నీలో..కళ్యాణ తిలకం
వినిపించె నాలో..కళ్యాణి రాగం
ఏనాటిదో ఈ రాగము..ఏ జన్మదో ఈ బంధము
ఏనాటిదో ఈ రాగము..ఏ జన్మదో ఈ బంధము
చరణం::1
నీవు నన్ను తాకిన చోట
పులకరింత పువ్వవుతుంటే
మేను మేను సోకిన పాట
వేణు గానమైపోతుంటే
నీవు నన్ను తాకిన చోట
పులకరింత పువ్వవుతుంటే
మేను మేను సోకిన పాటా
వేణు గానమైపోతుంటే
మనసులో మధుర వయసులో
యమున కలిసి జంటగా సాగనీ
మన జవ్వనాల నవ నందనాల
మధు మాస మధువులే పొంగనీ
ముద్దు ముద్దులడిగిన వేళా
నెమలి ఆట..ఆడనీ
ముద్దు ముద్దులడిగిన వేళా
నెమలి ఆట..ఆడనీ
ఇదే రాసలీలా..ఇదే రాగడోలా
ఇదే రాసలీలా..ఇదే రాగడోలా
నా జీవన బృందావనిలో..ఆమని ఉదయంలో
నిను చూసిన తొలి ఆశలు..విరబూసిన సమయంలో
నా జీవన బృందావనిలో..ఆమని ఉదయంలో
నిను చూసిన తొలి ఆశలు..విరబూసిన సమయంలో
నా ప్రాణమంతా..నీ వేణువాయె
పులకింతలన్నీ..నీ పూజలాయె
ఏ యోగమో ఈ రాగమో
ఏ జన్మదో ఈ బంధమో
ఏ యోగమో ఈ రాగమో
ఏ జన్మదో ఈ బంధమో
చరణం::2
ఇంద్రధనస్సు పల్లకీలో
చంద్రుడల్లె నువ్వొస్తుంటే
నల్లమబ్బు కాళ్ళు కడిగీ
మెరుపు కొంగు ముడిపెడుతుంటే
ఇంద్రధనస్సు పల్లకీలో
చంద్రుడల్లె నువ్వొస్తుంటే
నల్లమబ్బు కాళ్ళు కడిగీ
మెరుపు కొంగు ముడిపెడుతుంటే
రాగల హరి అనురాగ నగరి
రస రాజధాని నను చేరనీ
శృంగార రాజ్య సౌందర్య రాణి
పద రేణువై..చెలరేగనీ
నింగి నేల కలిసిన చోట
నిన్ను నేను పొందనీ
నింగి నేల కలిసిన చోట
నిన్ను నేను పొందనీ
అదే రాసలీలా అదే రాగడోలా
అదే రాసలీలా అదే రాగడోలా
No comments:
Post a Comment