సంగీతం::చళ్ళపళ్ళి సత్యం
రచన::వేటూరిసుందరరామమూర్తి
గానం::S.P.బాలు,P.సుశీల
తారాగణం::జయప్రద, రంగనాద్, కాంతారావు,దీప,రాజశ్రీ,రమాప్రభ,సాక్షి రంగారావు
పల్లవి::
ఇదే ఇదే నేను కోరుకుంది..ఈ..ఈ..
ఇలా ఇలా చూడాలని ఉంది..ఈ..ఈ
ఇదే ఇదే నేను..కోరుకుంది..ఈ..ఈ..
ఇలా ఇలా..చూడాలని ఉంది..ఈ..ఈ
బిడియం మానేసి..నడుమున చెయ్ వేసి
బిడియం మానేసి..నడుమున చెయ్ వేసి
అడుగు అడుగు కలపాలని..ఉంది..ఈ..ఈ
ఇదే ఇదే నేను..కోరుకుంది..ఈ..ఈ..
ఇలా ఇలా..చూడాలని ఉంది..ఈ..ఈ..
అహ..హా..ల..లా
చరణం::1
నాలోన మ్రోగే ఈ వేళలోనా
నీ లేత పరువాల వీణా
ఈనాడు కురిసే నీ కళ్ళలోనా
అనురాగ కిరణాల వానా
తలపుల తెర తీసి
వలపులు కలబోసి..ఈ..ఈ
తలపుల తెర తీసి
వలపులు కలబోసి
ఒదిగి ఒదిగి ఉండాలని ఉంది..ఈ..ఈ
ఇదే ఇదే నేను..కోరుకుంది..ఈ..ఈ
ఇలా ఇలా..చూడాలని ఉంది..ఈ..ఈ
బొమ్మలు మానేసి..రంగులు చిమ్మేసి
బొమ్మలు మానేసి..రంగులు చిమ్మేసి
కనుబొమ్మలు కలపాలనఉందీ..ఈ..ఈ
ఇదే ఇదే నేను కోరుకుంది..ఈ..ఈ
ఇలా ఇలా చూడాలని ఉంది..ఈ..ఈ
చరణం::2
మాటాడు బొమ్మ..మనసున్న బొమ్మ
నీ ముందు నిలిచింది చూడు
మురిపాలు కోరి..అలవోలే చేరి
నీ చెంప మీటింది నేడు
కలవరమేలేదా? కదలిక యే లేదా?
కలవరమేలేదా? కదలిక యే లేదా?
కలిసి ఊసులాడాలని..ఉందీ..ఈ..ఈ
ఇదే ఇదే నేను..కోరుకుంది..ఈ..ఈ
ఇలా ఇలా..చూడాలని ఉంది..ఈ..ఈ
చరణం::3
ఎన్నెన్ని విరులో ఈ పాన్పు పైన..మన రాకకై వేచెనేమో
ఎన్నెన్ని మరులో ఈ రేయిలోనా..మనకోసమే వేచెనేమో
మనసులు శృతి చేసి..తనువులు జత చేసి
మనసులు శృతి చేసి..తనువులు జత చేసి
పగలు రేయి కలపాలని..ఉందీ..ఈ..ఈ
ఇదే ఇదే నేను కోరుకుంది
ఇలా ఇలా చూడాలని ఉందీ..ఈ..ఈ
ఇదే ఇదే నేను కోరుకుంది
ఇలా ఇలా చూడాలని ఉందీ..ఈ..ఈ
No comments:
Post a Comment