Sunday, March 28, 2010

కోడళ్ళొస్తున్నారు జాగ్రత్త--1980

























సంగీతం::సత్యం
రచన::వేటూరి
గానం::P.సుశీల
తారాగణం::శోభన్ బాబు,శ్రీధర్,ఈశ్వర రావు,శారద,సంగీత,మంజు భార్గవి,గీత,కల్పనా రాయ్ 

పల్లవి:: 

తొలి రాతిరి మీరడిగిన ప్రశ్నకు
తొమ్మిది నెలలు ఆగాలి
నేను కమ్మని జవాబు చెప్పాలి

చరణం::1

ఈయనేమో శ్రీవారు ఇల్లాలై పాపం మీరు
చెయ్యి కాల్చుకోవాలనీ..
శ్రీమతినే బహుమతి కోరి శ్రీమతిగా తమరే మారి
ఉయ్యాలలూపాలనీ..
అందాలే చిందులు వేసి అయ్యగారి ఎత్తులు మరిగి
అభిషేకాలే చేస్తూ ఉంటే

అవునులేండి..తప్పేముంది..తప్పేదేముంది హ..హ

మలి రాతిరి మీరడిగిన ప్రశ్నకు
మళ్ళీ కొంచెం ఆగాలి నేను తీయని జవాబు చెప్పాలి
తొలి రాతిరి మీరడిగిన ప్రశ్నకు
తొమ్మిది నెలలు ఆగాలి
నేను కమ్మని జవాబు చెప్పాలి

చరణం::2

రెండేళ్ళ ముద్దులు ముదిరి పండంటి పాపలు కదిలే
సంసారమే సర్వమూ
ఇన్నాళ్ళ ఖర్చులు తరిగి ఇక ముందు ఆదా జరిగి
ఈ ఇల్లే మన స్వర్గమూ 
ఇద్దరితో ముచ్చట పడక మీరింకా ప్రశ్నలు వేస్తే
ముగ్గురితో ఫుల్ స్టాప్ అంటే 

ఏమీ అనుకోకండీ..ముందుంది ముసళ్ల పండగ హ..హ

ఇక ముందు మీరడిగితే ప్రశ్నలు మనమే జవాబు చెప్పాలి
మనకే జవాబు దారి తెలియాలి

తొలి రాతిరి మీరడిగిన ప్రశ్నకు..తొమ్మిది నెలలు ఆగాలి
నేను కమ్మని జవాబు హు హు హు

Kodalostunnaru Jaagratta--1980
Music::Satyam
Lyrics::Veturi
Singer's::P.Suseela
Cast::SobhanBabu,Sreedhar,ISwarRao,Saarada,Sangeeta,
ManjuBhargavi,Geeta,Kalpanaraay,

::: 

toli raatiri meeraDigina praSnaku
tommidi nelalu aagaali
nEnu kammani javaabu cheppaali

:::1

eeyanEmO Sreevaaru illaalai paapan meeru
cheyyi kaalchukOvaalanee..
SreematinE bahumati kOri Sreematigaa tamarE maari
uyyaalaloopaalanee..
andaalE chindulu vEsi ayyagaari ettulu marigi
abhishEkaalE chEstoo unTE

avunulEnDi..tappEmundi..tappEdaemundi ha..ha

mali raatiri meeraDigina praSnaku
maLLee konchen aagaali nEnu teeyani javaabu cheppaali
toli raatiri meeraDigina praSnaku
tommidi nelalu aagaali
nEnu kammani javaabu cheppaali

:::2

renDELLa muddulu mudiri panDanTi paapalu kadilE
sansaaramE sarvamoo
innaaLLa kharchulu tarigi ika mundu aadaa jarigi
ee illE mana svargamoo 
iddaritO muchchaTa paDaka meerinkaa praSnalu vEstE
mugguritO full stop anTE 

Emee anukOkanDee..mundundi musaLla panDaga ha..ha

ika mundu meeraDigitE praSnalu manamE javaabu cheppaali
manakE javaabu daari teliyaali

toli raatiri meeraDigina praSnaku..tommidi nelalu aagaali
nEnu kammani javaabu hu..hu..hu

No comments: