Monday, March 29, 2010

ప్రేమాభిషేకం--1981




















సంగీతం::చక్రవర్తి
రచన::దాసరి నారాయణరావ్ 
గానం::S.P.బాలు

పల్లవి::

మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్..ఆ ఆ ఆ ఆ ఆ ఆ 
తారలు దిగి వచ్చిన వేళ..మల్లెలు నడిచొచ్చిన వేళ
చందమామతో ఒక మాట..చెప్పాలి ఒక పాట పాడాలి
చందమామతో ఒక మాట..చెప్పాలి ఒక పాట పాడాలి
తారలు దిగి వచ్చిన వేళ..మల్లెలు నడిచొచ్చిన వేళ
తారలు దిగి వచ్చిన వేళా..ఆ ఆ ఆ

చరణం::1

ఊరంతా ఆకాశానా..గోరంత దివ్వెగా
పిడికెడంత గుండెలోనా..కొండంత వెలుగుగా
కనిపించే రంగులన్ని..సింధూరపు చీరెలా
కనిపించని సిగ్గులన్ని..ముసుగేసిన మబ్బుగా
కనిపించే రంగులన్ని..సింధూరపు చీరెలా
కనిపించని సిగ్గులన్ని..ముసుగేసిన మబ్బుగా
కనిపించే రంగులన్ని..సింధూరపు చీరెలా
కనిపించని సిగ్గులన్ని..ముసుగేసిన మబ్బుగా
నిలిచిపొమ్మని మబ్బుగా..కురిసిపోమ్మని వానగా
విరిసిపొమ్మని వెన్నెలగా..మిగిలిపొమ్మని నా గుండెగా
మిగిలిపొమ్మని నా గుండెగా..

చందమామతో ఒక మాట చెప్పాలి..ఒక పాట పాడాలి
చందమామతో ఒక మాట చెప్పాలి..ఒక పాట పాడాలి
తారలు దిగి వచ్చిన వేళ మల్లెలు..నడిచొచ్చిన వేళ
తారలు దిగి వచ్చిన వేళా..ఆ ఆ ఆ

చరణం::2

నీలిరంగు చీకటిలో..నీలాల తారగా
చూడనంత శూన్యములో..దొరకనంత ఆశగా
వేటాడే చూపులన్ని..లోలోన ప్రేమగా
వెంటాడే వలపులన్ని..కాబోయే పెళ్ళిగా
వేటాడే చూపులన్ని..లోలోన ప్రేమగా
వెంటాడే వలపులన్ని..కాబోయే పెళ్ళిగా
చెప్పి పొమ్మని మాటగా..చేసి పొమ్మని బాసగా
చూపి పొమ్మని బాటగా..ఇచ్చి పొమ్మని ముద్దుగా
ఇచ్చి పొమ్మని ముద్దుగా

చందమామతో ఒక మాట చెప్పాలి..ఒక పాట పాడాలి
చందమామతో ఒక మాట చెప్పాలి..ఒక పాట పాడాలి
తారలు దిగి వచ్చిన వేళ మల్లెలు..నడిచొచ్చిన వేళ
తారలు దిగి వచ్చిన వేళా..ఆ ఆ ఆ 

No comments: