సంగీతం::S.రాజేశ్వరరావు
రచన::దాశరధి
గానం::P.సుశీల
తారాగణం::అక్కినేని,కాంచన,గుమ్మడి, రాజశ్రీ,రేలంగి,సూర్యకాంతం, చలం
పల్లవి::
బ్రతుకే నేటితో బరువై పోయెలే
బ్రతుకే నేటితో బరువై పోయెలే
మదిలో ఆశలే మసిగా మారెలే
బ్రతుకే నేటితో బరువై పోయెలే
చరణం::1
వెలుగే వేడగా చీకటి నిండెనే
వెలుగే వేడగా చీకటి నిండెనే
వలపే కోరగా వగపె కలిగే
ఆరని శోకమే ఆహుతి చేసెనే
బ్రతుకే నేటితో బరువై పోయెలే
చరణం::2
నీ సౌఖ్యానికి సౌభాగ్యానికి
నీ వారందరూ బలి కావాలా
నీ సౌఖ్యానికి సౌభాగ్యానికి
నీ వారందరూ బలి కావాలా
తీరని వేదనా రగిలించేవా
బ్రతుకే నేటితో బరువై పోయెలే
చరణం::3
శిలవై పోదువో కలవై పోదువో
సగమై ఆగినా కథ అయిపోదువో
కంటికి ధారగా కరిగే పోదువో
కంటికి ధారగా కరిగే పోదువో
No comments:
Post a Comment