సంగీతం::T.V.రాజు
రచన::సినారె
గానం::ఘంటసాల,P.సుశీల
తారాగణం:N.T.రామారావు, జమున,రేలంగి, గిరిజ,రాజనాల, ఎల్.విజయలక్ష్మి
పల్లవి::
కనులీవేళ చిలిపిగ నవ్వెను
మనసేవేవో వలపులు రువ్వెను
చెలి..నా చెంత నీకింత జాగేలనే
చెలి..నా చెంత నీకింత జాగేలనే
కనులీవేళ చిలిపిగ నవ్వెను
మనసేవేవో వలపులు రువ్వెను
ఇక అందాల ఉయ్యాల లూగింతులే
ఇక అందాల ఉయ్యాల లూగింతులే
చరణం::1
మధుర శృంగార మందార మాల..కదలి రావేల కలహంస లీల
మధుర శృంగార మందార మాల..కదలి రావేల కలహంస లీల
రంగు రంగుల బంగారు చిలకా
రంగు రంగుల బంగారు చిలక..వలచి నీ ముందు వాలిందిలే..ఏ ఏ
కనులీవేళ చిలిపిగ నవ్వెను..మనసేవేవో వలపులు రువ్వెను
చెలి..నా చెంత నీకింత జాగేలనే
చెలి..నా చెంత నీకింత జాగేలనే
చరణం::2
చరణ మంజీర నాదాలలోన..కరగి పోనిమ్ము గంధర్వ బాలా
చరణ మంజీర నాదాలలోన..కరగి పోనిమ్ము గంధర్వ బాలా
సడలి పోవని సంకెళ్ళు వేసీ
సడలి పోవని సంకెళ్ళు వేసి..సరస రాగాల తేలింతులే..ఏ ఏ
కనులీవేళ చిలిపిగ నవ్వెను..మనసేవేవో వలపులు రువ్వెను
ఇక అందాల ఉయ్యాల లూగింతులే
ఇక అందాల ఉయ్యాల లూగింతులే
No comments:
Post a Comment