Friday, February 28, 2014

జరిగిన కథ--1969




సంగీతం::ఘంటసాల
రచన::ఆరుద్ర
గానం::ఘంటసాలL.R.ఈశ్వరీ
Film Directed By::K.Babu Rao
తారాగణం::జగ్గయ్య,కృష్ణ,నాగయ్య,రాజబాబు,రాజనాల,బాలకృష్ణ,అల్లురామలింగయ్యసీతారాం,K.V.చలం,యేడిద నాగేశ్వరరావు,కాంచన,విజయలలిత,బేబి రోజారమణి,శ్రీరంజని,సూర్యకాంతం,చాయాదేవి,అర్జా జనార్ధనరావు.

పల్లవి::

లౌ లౌ లౌమి నెరజాణ..యస్ డార్లింగ్
నౌ నౌ కిస్‌మి చినదానా..విత్ ప్లెజర్ 
సుఖములు సొగసులు అందించే..ఖజానా..హోయ్

లౌ లౌ లౌమి మొనగాడా..ఓ లౌలీ
నౌ నౌ కిస్‌మి చిన్నోడా..యస్ బ్యూటీ 
సుఖములు సొగసులు..నీవేరా నారా..హాయ్ 
లౌ లౌ లౌమి మొనగాడా..ఆఆఆ

చరణం::1

కమాన్..నా ఆశ రమ్మంది
గెటప్..నీ వలపు లెమ్మంది
కమాన్..నా ఆశ రమ్మంది
గెటప్..నీ వలపు లెమ్మంది
మగసిరితో..మక్కువతో
మనసారా..నను లాలించు

లౌ లౌ లౌమి మొనగాడా..ఓ లౌలీ
నౌ నౌ కిస్‌మి చిన్నోడా..యస్ బ్యూటీ 
సుఖములు సొగసులు..నీవేరా నారా..హాయ్ 
లౌ లౌ లౌమి మొనగాడా..ఆఆఆ

చరణం::2

ఓహో..రంగేళి నీవైతే
భలే కిల్లాడి..నేనేలే
ఓహో..రంగేళి నీవైతే
భలే కిల్లాడి..నేనేలే 
నీ పొగరూ..నా నెనరూ 
నేడే ఊయలు..ఊగించు

లౌ లౌ లౌమి నెరజాణ..యస్ డార్లింగ్
నౌ నౌ కిస్‌మి చినదానా..విత్ ప్లెజర్ 
సుఖములు సొగసులు అందించే..ఖజానా..హోయ్

లౌ లౌ లౌమి మొనగాడా..ఓ లౌలీ
నౌ నౌ కిస్‌మి చిన్నోడా..యస్ బ్యూటీ 
సుఖములు సొగసులు..నీవేరా నారా..హాయ్ 
లౌ లౌ లౌమి మొనగాడా..ఆఆఆ

Jarigina Katha--1969 
Music::Ghantasaala
Lyrics::Arudra
Singer::Ghantasaala,L.R.Iswarii
Film Directed By::K.Babu Rao
Cast::Jaggayya,Krishna,Naagayya,Raajabaabu,Raajanaala,Baalakrishna,Alluraamalingayya,Seetaaraam,K.V.Chalam,Yedida Naageswara Rao,Kanchana,Vijayalalita,Beby Rojaaramani,Sriranjani,Sooryakaantam,Chaayaadevi,ArjaaJanaardhana Rao.

:::::::::::::::::::::::::::::::::::

love loveu loveme nerajaaNa..yes Darling
now now kissme chinadaanaa..with pleasure 
sukhamulu sogasulu andinchE..khajaanaa..hOy

love loveu loveme monagaaDaa..O lovely
now now kissme chinnODaa..yes beauty  
sukhamulu sogasulu..neevEraa naaraa..haay 
love loveu loveme monagaaDaa..aaaaaaaa

::::1

Common..naa ASa rammandi
Getup..nee valapu lemmandi
Common..naa ASa rammandi
Getup..nee valapu lemmandi
magasiritO..makkuvatO
manasaaraa..nanu laalinchu

love loveu loveme monagaaDaa..O lovely
now now kissme chinnODaa..yes beauty  
sukhamulu sogasulu..neevEraa naaraa..haay 
love loveu loveme monagaaDaa..aaaaaaaa

::::2

OhO..rangELi neevaitE
bhalE killaaDi..nEnElE
OhO..rangELi neevaitE
bhalE killaaDi..nEnElE 
nee pogaruu..naa nenaruu 
nEDE Uyalu..Uginchu

love loveu loveme nerajaaNa..yes Darling
now now kissme chinadaanaa..with pleasure 
sukhamulu sogasulu andinchE..khajaanaa..hOy

love loveu loveme monagaaDaa..O lovely
now now kissme chinnODaa..yes beauty  
sukhamulu sogasulu..neevEraa naaraa..haay 
love loveu loveme monagaaDaa..aaaaaaaa

చిల్లర కొట్టు చిట్టెమ్మ--1977




సంగీతం::రమేశ్ నాయుడు
రచన::దాసం గోపాలకృష్ణ
గానం::P.సుశీల 
Film Directed By::Dasarinarayana Rao
తారాగణం::మురళిమోహన్,జయచిత్ర,మాడా,గోకిన రామారావు,

పల్లవి::

చుక్కల్లో పెద చుక్క..చందమామా
ఎలుగులకే ఎలుగమ్మ..ఎన్నెలమ్మా
ఆ చందమామకు..ఈ ఎన్నెలమ్మకు 
చల్లని గోదారి ఒడిలో..పెళ్ళమ్మా..ఆ
ముత్యాల జల్లమ్మా..ఆ

చుక్కల్లో పెద చుక్క..చందమామా
ఎలుగులకే ఎలుగమ్మ..ఎన్నెలమ్మా
ఆ చందమామకు..ఈ ఎన్నెలమ్మకు 
చల్లని గోదారి ఒడిలో..పెళ్ళమ్మా..ఆ
ముత్యాల జల్లమ్మా..ఆ

చరణం::1 

ఏటి గాలికి..పెళ్ళికొడుకులో 
ఎగిసే బాసల..అలలెన్నో..ఓ..ఓ..ఓ..ఓ
పడవ ఇసురుతో..పెళ్ళిపడుచులో 
పలికే తీయని కలలెన్నో..ఓ..ఓ..ఓ..ఓ
అరమూసే..ఆ కళ్ళే చెబుతాయి..ఈఈ 
ఇరబూసే నీ..అందాలే చెబుతాయి..ఈ

చుక్కల్లో పెద చుక్క..చందమామా
ఎలుగులకే ఎలుగమ్మ..ఎన్నెలమ్మా
ఆ చందమామకు..ఈ ఎన్నెలమ్మకు 
చల్లని గోదారి ఒడిలో..పెళ్ళమ్మా..ఆ
ముత్యాల జల్లమ్మా..ఆ

చరణం::2

ఉలకని పలకని..మూగరాలివని 
తెలిసే అందరు వస్తారు..ఊ..ఊ..ఊ..ఊ
కోరినవన్నీ..అవుతాయనుకొని 
గుండె నింపుకొని వెళతారు..ఊ..ఊ..ఊ..ఊ
మౌనంగా ఎన్నాళ్ళు..ఉంటావోయమ్మ
మనసార ఈసారైన..దీవించవమ్మా
మనసార ఈసారైన..దీవించవమ్మా

చుక్కల్లో పెద చుక్క..చందమామా
ఎలుగులకే ఎలుగమ్మ..ఎన్నెలమ్మా
ఆ చందమామకు..ఈ ఎన్నెలమ్మకు 
చల్లని గోదారి ఒడిలో..పెళ్ళమ్మా..ఆ
ముత్యాల జల్లమ్మా..ఆ

Chillarakottu Chittemma--1977
Music::Ramesh Nayudu
Lyrics::Daasam Gopaalakrishna
Singer::P.Suseela
Film Directed By::Dasarinarayana Rao
Cast::Muralimohan,Jayachitra,Maada,Gokina Ramaa Rao.

::::::::::::::::::::::::::::::::::::::::::::::::

chukkallO peda chukka..chandamaamaa
elugulakE elugamma..ennelammaa
aa chandamaamaku..ii ennelammaku 
challani gOdaari oDilO..peLLammaa..aa
mutyaala jallammaa..aa

chukkallO peda chukka..chandamaamaa
elugulakE elugamma..ennelammaa
aa chandamaamaku..ii ennelammaku 
challani gOdaari oDilO..peLLammaa..aa
mutyaala jallammaa..aa

::::1 

ETi gaaliki..peLLikoDukulO 
egisE baasala..alalennO..O..O..O..O
paDava isurutO..peLLipaDuchulO 
palikE teeyani kalalennO..O..O..O..O
aramoosE..aa kaLLE chebutaayi..iiii 
iraboosE nii..andaalE chebutaayi..ii

chukkallO peda chukka..chandamaamaa
elugulakE elugamma..ennelammaa
aa chandamaamaku..ii ennelammaku 
challani gOdaari oDilO..peLLammaa..aa
mutyaala jallammaa..aa

::::2

ulakani palakani..moogaraalivani 
telisE andaru vastaaru..uu..uu..uu..uu
kOrinavannii..avutaayanukoni 
gunDe nimpukoni veLataaru..uu..uu..uu..uu
maunangaa ennaaLLu..unTaavOyamma
manasaara iisaaraina..deevinchavammaa
manasaara iisaaraina..deevinchavammaa

chukkallO peda chukka..chandamaamaa
elugulakE elugamma..ennelammaa
aa chandamaamaku..ii ennelammaku 
challani gOdaari oDilO..peLLammaa..aa
mutyaala jallammaa..aa

కళ్యాణ మంటపం--1971












సంగీతం::P.ఆదినారాయణరావు
రచన::దేవులపల్లి కృష్ణశాస్ర్తి
గానం::P.సుశీల
Film Director::V. Madhusudhan Rao
తారాగణం::శోభన్‌బాబు,కాంచన,జగ్గయ్య,అంజలిదేవి,నాగభూషణం,గుమ్మడి,రాజబాబు,బేబిశ్రీదేవి,సంధ్యరాణి,
రమాప్రభ.

పల్లవి::

చుక్కలు పాడే శుభమంత్రం
దిక్కులు నిండే దివ్యమంత్రం
ఎక్కడనో ఎపుడో ఎవరో పలికిన వేదమంత్రం
ఇక్కడనే ఇపుడే ఎవరో
నా చెవిలో ఊదిన మంత్రం మధు మంత్రం
చుక్కలు పాడే శుభమంత్రం

చరణం::1

రెక్కలపై ఆ గువ్వల జంట..ఆ
రేకులలో ఆ పుష్పాల జంట..ఆ

సాగుచునే..ఊగుచునే..
మధుర మధురముగ మక్కువగ
చదువుకునే ఆనంద మంత్రం
చుక్కలు పాడే శుభమంత్రం

చరణం::2

కన్నులు ఒకపరి మూసుకొని
నీవన్నది మరి మరి తలచుకొని

ఒక్కతెనే నేనొక్కతెనే
అదే పనిగనే సదా మనసులో
ఆలపించే ప్రియ మంత్రం
చుక్కలు పాడే శుభమంత్రం

చరణం::3

కోవెల దైవం పిలిచేదాకా..ఆ
ఆవలి ఒడ్డున నిలిచేదాకా..ఆ

నాలోనే..లోలోనే..
నాతిచరామి నాతిచరామి
అది నా ప్రాణ మంత్రం

Kalyaana Mantapam--1971
Music::P.AdinarayanaRavu 
Director::V.Madhusudanarao 
Lyrics::Devula Palli KrishnaSaasrii
Singer::P.Suseela
Cast::Sobhanbabu,Kanchana,Jaggayya,Nagabhushanam,Anjalidevi,Gummadi,Rajababu,Sandhyarani,Ramaaprabha.

:::::::::

chukkalu paaDE Subhamantram
dikkulu ninDE divyamantram
ekkaDanO epuDO evarO palikina vEdamantram
ikkaDanE ipuDE evarO..
naa chevilO oodina mantram madhu mantram
chukkalu paaDE Subhamantram

::::1

rekkalapai aa guvvala janTa..aa
rEkulalO aa pushpaala janTa..aa

saaguchunE..ooguchunE..EE
madhura madhuramuga makkuvaga
chaduvukunE aananda mantram
chukkalu paaDE Subhamantram

::::2

kannulu okapari moosukoni..ii
neevannadi mari mari talachukoni..ii

okkatenE nEnokkatenE
adE paniganE sadaa manasulO
aalapinchE priya mantram
chukkalu paaDE Subhamantram

::::3

kOvela daivam pilichEdaakaa..aa
aavali oDDuna nilichEdaakaa..aa

naalOnE..lOlOnE..EE
naaticharaami naaticharaami

adi naa praaNa mantram

Wednesday, February 26, 2014

చాణక్య చంద్రగుప్త--1977
























సంగీతం::పెండ్యాల
రచన::సినారె
గానం::P.సుశీల

తారాగణం::N.T. రామారావు, అక్కినేని, శివాజీ గణేషన్, జయప్రద,మంజుల,పద్మనాభం,రాజబాబు

పల్లవి:: 

ఎవరో అతడెవరో...?? 

ఎవరో..ఓ..ఓ..ఓ..ఓ ఆ చంద్రుడు ఎవరో..ఓ..ఓ..ఓ 
ఆ వీర చంద్రుడు ఎవరో..ఎవరో

ఎవరో..ఓ..ఓ..ఓ..ఆ చంద్రుడు ఎవరో
ఆ వీర చంద్రుడు ఎవరో..ఎవరో

ఈ రాచ తోటలో ఓ..ఓ..వున్నాడో
ఏ..రతనాల కోటలో కొలువున్నాడో 
ఎవరో..ఓ..ఓ..ఓ..ఓ 

చరణం::1 

పదములలో..నా..ఆ..హృదయమున్నదో 

హృదయమే తడబడీ అడుగిడుతున్నదో

పదములలో..నా..ఆ..హృదయమున్నదో 
హృదయమే తడబడీ అడుగిడుతున్నదో
ఏ..పున్నమికై..ఈ కలువ వున్నదో

ఏ..పున్నమికై..ఈ..కలువ వున్నదో 
ఏ..రేని పూజకు ఈ చెలువ ఉన్నదో
ఎవరో..ఓ..ఓ..ఓ..ఓ 
ఆ చంద్రుడు ఎవరో
ఎవరో..ఓ..ఓ..ఓ..ఆ చంద్రుడు ఎవరో
ఆ వీర చంద్రుడు ఎవరో..ఎవరో

చరణం::2 

మనసు గీసినది కనరానీ రూపం 
కనులు అల్లినది అనుకోని గీతం మూ..మూ..మూ..మూ 

మనసు గీసినది కనరానీ రూపం 
కనులు అల్లినది అనుకోని గీతం 
చంద్ర.. 

తీయనీ ఏ తలపో..ఓ..ఓ..ఓ..ఈ కలవరింత 
తెలియని ఏ వలపో..ఓ..ఓ..ఓ.ఈ పులకరింతా 

ఎవరో..ఓ..ఓ..ఓ..ఓ..ఆ చంద్రుడు ఎవరో
ఆ వీర చంద్రుడు ఎవరో..ఎవరో
ఎవరో..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ

పరువు ప్రతిష్ట--1963




















సంగీతం::పెండ్యాల
రచన::శ్రీశ్రీ
గానం::ఘంటసాల,P.సుశీల
తారాగణం::N.T. రామారావు, చలం, అంజలీదేవి,రేలంగి, గుమ్మడి, కన్నాంబ 

పల్లవి:

ఆ ఆ ఆ ఆ ఆ..ఆహాహా ఆహాహా..ఆ ఆ ఆహ్హా ఆ  ఆ మబ్బు..తెరలలోన..దాగుంది..చందమామ
ఈ సిగ్గుపొరలలోన..బాగుంది..సత్యభామ
ఏమంది..సత్యభామ

ఏమందో..ఏమో కాని..పరిహాసాలే..చాలునంది
శ్రీవారిని..ఐదారడుగుల..దూరాన..ఆగమంది
దూరాన..ఆగమంది

చరణం::1

ఈ గాలి..ఊయలా..ఊగించు..పయ్యెదా
ఈ గాలి..ఊయలా..ఊగించు..పయ్యెదా
ఊరించే..సైగలతోనే..ఏమంది..తియ్యగా

పరువాల..తొందరా..నెలరాజు..ముందరా
పరువాల..తొందరా..నెలరాజు..ముందరా
మర్యాదా..కాదని కాదా..పలికింది..చల్లగా
పలికింది..మెల్లగా

ఆ మబ్బు..తెరలలోనా..దాగుంది..చందమామ
ఈ సిగ్గుపొరలలోనా..బాగుంది..సత్యభామ
ఏమంది..సత్యభామ

ఏమందో..ఏమో కాని..పరిహాసాలే..చాలునంది
శ్రీవారిని..ఐదారడుగుల..దూరాన..ఆగమంది
దూరాన..ఆగమంది

చరణం::2

సిగలోని..పువ్వులు..చిలికించే నవ్వులు
సిగలోని... పువ్వులు ...చిలికించే నవ్వులు
ఓ......ఓ.....ఓ....ఓ.....ఓ....
మనకోసం..ఏ సందేశం..అందించే ప్రేయసీ

ఆనంద సీమలా..అనురాగ డోలలా
ఆనంద సీమలా..అనురాగ డోలలా
కలకాలం..తేలీసోలీ..ఆడాలి హాయిగా
అన్నాయి..తియ్యగా

ఆ మబ్బు..తెరలే తొలగి..ఆగింది..చందమామ
ప్రేమికుల..హృదయము తెలిసి..పాడింది..చందమామ
పాడింది..చందమామ

ఆహా..హా..హా..ఆ..ఆ..ఆ..

Tuesday, February 25, 2014

అశోక చక్రవర్తి--1993



















సంగీతం::ఇళయరాజా
రచన::వీటూరి 
గానం::S.P.బాలు , S.జానకి
తారాగణం::బాలకృష్ణ,భానుప్రియ. 

పల్లవి::

ఎందరో మహానుభావులు..ఒక్కరికే వందనము 
ఎందరో మహానుభావులు..ఒక్కరికే వందనము
ఒడినే గుడిగా మలచి..తమనే వలచి..పిలిచే..వేళ

ఎందరో మహానుభావులు..సుందరికే బంధనము
ఎందరో మహానుభావులు..సుందరికే బంధనము
ఎదలా ఎదుటే నిలిచి..వలపై..ఇలపై..నిలిచే..వేళ
ఎందరో మహానుభావులు..ఒక్కరికే వందనము

చరణం::1

నీ రాధనేరా..ఆడాలిరా రాసలీల
శ్రీకృష్ణుడల్లే వస్తానులే..వేసి ఈల
నీకెందుకా దేవి పూజ..నేనుండగ బ్రహ్మచారి
పూజారినే వలచుటేల..ఈ దేవతే కాలుజారి
అందుకో..మహానుభావుడా కౌగిలినే కానుకగా
ఆపవే బాలికా..చాలికా
ఎందరో మహానుభావులు..ఒక్కరికే వందనం
ఎందరో మహానుభావులు..సుందరికే బంధనము

చరణం::2

నీ కొంగు జారి..శృంగారమే ఆరబోసే
నీ దొంగ చూపే..నా లేత ప్రాణలు తీసే
నిన్నంటుకున్నాక రేయి..కన్నంటుకోనంది బాలా
గుళ్ళోకి నే తెచ్చుకుంటే..మెళ్ళోకి చేరింది మాల
అందుకే వరించు ఘాటుగా..కిమ్మనకా..పొమ్మనక
ఆపరా..నా దొర..తొందరా
ఎందరో మహానుభావులు..సుందరికే బంధనము
ఎందరో మహానుభావులు..ఒక్కరికే వందనం
ఒడినే గుడిగా మలచి..తమనే వలచి..పిలిచే..వేళ
ఎందరో మహానుభావులు..సుందరికే బంధనము

తారక రాముడు--1997



సంగీతం::రాజ్ కోటి
రచన::సిరివెన్నెల
గానం::S.P.బాలసుబ్రహ్మణ్యం,K.S.చిత్ర
Film Directed By::R.V.Uday Kumar 
తారాగణం::సౌధర్య,శ్రీకాంత్

పల్లవి::

కోపం వస్తే మండుటెండ 
మనసు మాత్రం వెండికొండ 
కోపం వస్తే మండుటెండ 
మనసు మాత్రం వెండికొండ
వానమబ్బు లాంటి వాటం నీదయా

నాకు తెలుసా..మంచి చెడ్డ 
నువ్వు చెబితే..నేర్చుకుంట
నిన్ను నమ్మినాను..అంతా దయా

నీ అల్లర్లు అందం..నీ అలకల్లు అందం
నన్ను కవ్వించి నవ్వించే..నీ నేస్తమే మంచి గంధం

కోపం వస్తే...మండుటెండ 
మనసు మాత్రం...వెండికొండ
వానమబ్బు లాంటి వాటం నీదయా

చరణం::1

చెర్లో ఉన్న చాకిరేవు బండ నేనటా
గుళ్ళో ఉన్న అమ్మవారి బొమ్మ నీవట

మురికిని కడిగినా మనసుని కడిగినా
రెండు రాళ్ళు చేసేదోకటే పేర్లే వేరటా

అవునో కాదో తెలియదు కానీ
నువ్వు చెబుతుంటే అవునంటా

మరి అంతలోనె బుంగమూతి సంగతేంటటా

నాకు తెలుసా మంచి చెడ్డ నువ్వు చెబితే నేర్చుకుంట

నిన్ను నమ్మినాను అంతా నీదయా

చరణం::2

నిండుకుండ కాదు కనుక తొణుకుతుందదీ
అంత వింత అందులోన ఏమిటున్నదీ

నాలో తెలివికీ దీన్లో నీటికీ
పోలికే గుళుకు గుళుకు పలుకుతున్నదీ

అమృతం లాంటీ హృదయం నీది
అంత కన్న వేరే వరమేది

అది తెలిసి కూడ కసురుకుంటే నేరమెవరిదీ

కోపం వస్తే మండుటెండ మనసు మాత్రం వెండికొండ
వానమబ్బు లాంటి వాటం నీదయా

నాకు తెలుసా మంచి చెడ్డ నువ్వు చెబితే నేర్చుకుంట
నిన్ను నమ్మినాను అంతా నీదయా

నీ అల్లర్లు అందం..నీ అలకల్లు అందం
నన్ను కవ్వించి నవ్వించే నీ నేస్తమే మంచి గంధం

Monday, February 24, 2014

అమరజీవి--1983













సంగీతం::చక్రవర్తి
రచన::వీటూరి 
గానం::S.P.బాలు, P.సుశీల
Film Directed By::Jandyaala
తారాగణం::అక్కినేనినాగేశ్వరరావు,జయప్రద,పండరిబాయి,సుమలత,శరత్‌బాబు,నరసింహరాజు,శ్రీలక్ష్మీ,నాగేష్ 

సాకి:: 

శ్రీ రంగనాధ చరణారవింద చారాణ చక్రవర్తి..పుంభావ భక్తి
ముక్తికై మూడు పుండ్రాలు నుదుటున దాల్చిన ముగ్ధ మోహన సుకుమార మూర్తీ 
ఈ..ఈ..ఈ..ఈ..ఈ
తొండరడిప్పొడి..నీ అడుగుధమ్ముల పడి..ధన్యమైనది
నీ దీన దీన దేవ దేవీ..నీ దాసాను దాసి
నీ పూజల కు పువ్వుగా..జపములకు మాలగా..పులకించి పూమాలగా
గళమునను..కరమునను..ఉరమునను 
ఇహములకు..పరములకు నీదాననై..ధన్యనై 
జీవన వరాన్యనై తరియించుదాన..మన్నించవే..మన్నించవే 
అని విన్నవించు నీ ప్రియ సేవిక..దేవ..దేవి

పల్లవి::

అసుర సంధ్య వేళ ఉసురు తగలనీకు స్వామి
ఆడ ఉసురు...తగలనీకు స్వామీ
ముసురుకున్న మమతలతో..కొసరిన అపరాధమేమి 
స్వామీ...స్వామీ
అసుర సంధ్య వేళ..ఉసురు తగలనీకు దేవీ 
స్వామీ ఉసురు..తగలనీకు దేవీ
మరులుకున్నకరిమి వీడి మరలి ఈ నర జన్మ మేమి..దేవి..దేవీ

చరణం::1

హరి హర సుర జేష్టాదులు..కౌశికశుకవ్యాసాదులు
హరి హర సుర జేష్టాదులు..కౌశికశుకవ్యాసాదులు
నిగ తత్వములను దెలిపి..నీమ నిష్టలకు అలసి
పూనిన శృంగార యోగం ఇది కాదని..నను కాదని 
జడదారీ..ఆ..ఆ..ఆ..ఆ..పడకు పెడ దారి
అసుర సంధ్య వేళ ఉసురు తగలనీకు స్వామి 
ఆడ ఉసురు..తగలనీకు స్వామీ 
అసుర సంధ్య వేళ..ఉసురు తగలనీకు దేవీ  
స్వామీ ఉసురు..తగలనీకు దేవీ

చరణం::2

నశ్వరమది..నాటక మిది..నాలుగు ఘడియల వెలుగిది
కడలిని కలిసే వరకే..కావేరికి రూపు ఉన్నదీ
రంగని కీర్తన చేసే..రాగమాలికను కానీ
రంగని భక్తుల ముంగిట రంగ వల్లికను కానీ 
దేవి..దేవీ..దేవ...దేవీ 
అసుర సంధ్య వేళ ఉసురు తగలనీకు దేవీ  
స్వామీ ఉసురు తగలనీకు దేవీ

చరణం::3 

అలిగే నట శ్రీ రంగం..తొలగే నట వైకుంటం
యాతన కేనా దేహం..ఈ దేహము సందేహం
ఈ క్షణమే సమ్మోహము..వీక్షణమే మరు దాహము
రంగా..రంగ..రంగ రంగ శ్రీ రంగ 
ఎటు ఓపను..ఎటులాపాను
ఒకసారి..అ..అ..అనుభవించు ఒడి చేరి

ముహూర్త బలం--1969




సంగీతం::K.V.మహాదేవన్
రచన::ఆరుద్ర
గానం::P.సుశీల    
Film Directed By::M.Mallikaarjuna Rao  
తారాగణం::కృష్ణ,హరినాథ్,నాగభుషణం,నాగయ్యా,రాజబబు,అల్లురామలింగయ్య,రావికొండలరావు,జమున,సూర్యకాంతం,విజయనిర్మల,జ్యోతిలక్ష్మీ,రాజేశ్వరీ,ఉదయలక్ష్మీ.

పల్లవి::

నీకు ఎంత మనసుందో..నాకు తెలుసునోయి
నాకు ఎంత గుబులుందో..నీకు తెలియదోయి

నీకు ఎంత మనసుందో..నాకు తెలుసునోయి
నాకు ఎంత గుబులుందో..నీకు తెలియదోయి 
రా..రా..రాజ..రాతి గుండెవాడా
హోయ్..రా..రా..రాజ..రాతి గుండెవాడా

చరణం::1

మెత్తగా తాకితే..ఉంగరాళ్ళ వేళ్ళూ..ఊఊ 
మత్తుగా ఉండదా..మాయదారి ఒళ్ళు

మెత్తగా తాకితే..ఉంగరాళ్ళ వేళ్ళూ..ఊఊ 
మత్తుగా ఉండదా..మాయదారి ఒళ్ళు

నీ కోడె వయసులోన ఉంది..కొత్తకొత్తవేడి కత్తిగోళ్ళవాడి..ఈఈఈఈ
రా..రా..రా..రాజ..నీకు నాకు జోడీ
రా..రా..రా..రాజ..నీకు నాకు జోడీ

చరణం::2

ఓరగా చూడగా..నోరు ఊరుతుందోయ్
ఇద్దరు కూడితే..ఇంపు పెరుగుతుందోయ్

ఓరగా చూడగా..నోరు ఊరుతుందోయ్
ఇద్దరు కూడితే..ఇంపు పెరుగుతుందోయ్

ఇది ఆకుచాటు పిందె కాదు..పచ్చికాయ కాదోయ్
చాకులాంటివాడా..ఆ ఆ ఆ

రా..రా..రాజ..నేనే రాజ నిమ్మలపండు
రా..రా..రాజ..నేనే రాజ నిమ్మలపండు

చరణం::3

వెన్నెలా ఉన్నదీ..వన్నెలాడి చూపే
వెచ్చగా ఇవ్వరా..నచ్చినట్టి కైపే

వెన్నెలా ఉన్నదీ..వన్నెలాడి చూపే
వెచ్చగా ఇవ్వరా..నచ్చినట్టి కైపే 

గువ్వపిట్ట కులుకుజూసీ..గుటకలేయువాడా గుండెదోచుకోరా

సై..సై..సై..ఇంక..స్వర్గమేల పోరా
సై..సై..సై..ఇంక..స్వర్గమేల పోరా

నీకు ఎంత మనసుందో..నాకు తెలుసునోయి
నాకు ఎంత గుబులుందో..నీకు తెలియదోయి
రా..రా..రాజ..రాతి గుండెవాడా
రా..రా..రాజ..రాతి గుండెవాడా

Muhurta Balam--1969
Music::K.V.Mahaadevan
Lyrics::Arudra
Singer::P.Suseela    
Film Directed By::M.Mallikaarjuna Rao 
Cast::Krishna,Harinaath,Nagabhushanam,Alluraamalingayya,Rajababu,Naagayya,Raavikondalarao,Jamuna,Sooryakaantam,Jyothilakshmii,Raaeswarii,Udayabhanu.

::::::::::::::::::::::::::::::::::::

neeku enta manasundO..naaku telusunOyi
naaku enta gubulundO..neeku teliyadOyi

neeku enta manasundO..naaku telusunOyi
naaku enta gubulundO..neeku teliyadOyi 
raa..raa..raaja..raati gunDevaaDaa
hOy..raa..raa..raaja..raati gunDevaaDaa

::::1

mettagaa taakitE..ungaraaLLa vELLU..uuuu 
mattugaa unDadaa..maayadaari oLLu

mettagaa taakitE..ungaraaLLa vELLU..uuuu 
mattugaa unDadaa..maayadaari oLLu

nee kODe vayasulOna undi..kottakottavEDi kattigOLLavaaDi..iiiiiiii
raa..raa..raa..raaja..neeku naaku jODii
raa..raa..raa..raaja..neeku naaku jODii

::::2

Oragaa chuuDagaa..nOru UrutundOy
iddaru kooDitE..impu perugutundOy

Oragaa chuuDagaa..nOru UrutundOy
iddaru kooDitE..impu perugutundOy

idi AkuchaaTu pinde kaadu..pachchikaaya kaadOy
chaakulaanTivaaDaa..aa aa aa

raa..raa..raaja..nEnE raaja nimmalapanDu
raa..raa..raaja..nEnE raaja nimmalapanDu

::::3

vennelaa unnadii..vannelaaDi choopE
vechchagaa ivvaraa..nachchinaTTi kaipE

vennelaa unnadii..vannelaaDi choopE
vechchagaa ivvaraa..nachchinaTTi kaipE 

guvvapiTTa kulukujoosii..guTakalEyuvaaDaa gunDedOchukOraa

sai..sai..sai..inka..swargamEla pOraa
sai..sai..sai..inka..swargamEla pOraa

neeku enta manasundO..naaku telusunOyi
naaku enta gubulundO..neeku teliyadOyi
raa..raa..raaja..raati gunDevaaDaa
raa..raa..raaja..raati gunDevaaDaa

Sunday, February 23, 2014

రామయ్య తండ్రి--1975























సంగీతం::సత్యం 
రచన::మల్లెమాల
గానం::S.P.బాలు P.సుశీల

పల్లవి::

వెన్నెల రోజు ఇది వెన్నెల రోజు
వెన్నెల రోజు ఇది వెన్నెల రోజు
అమావాస్య నాడు వచ్చే పున్నమి రోజు

పెద్దలంత పిల్లలుగా మారే రోజు
పల్లేదో పట్టణమేదో తెలియని రోజు
దీపావళి రోజు దీపావళి రోజు 

వెన్నెల రోజు ఇది వెన్నెల రోజు
వెన్నెల రోజు ఇది వెన్నెల రోజు
అమావాస్య నాడు వచ్చే పున్నమి రోజు
ఇది వెన్నెల రోజు పున్నమి రోజు ఇది వెన్నెల రోజు

చరణం::1

చంటిపాప నవ్వులకు పువ్వులు విరిసే రోజు
మింటనున్న తారకలు ఇంటింట వెలిగే
దీపావళి రోజు దీపావళి రోజు
వెన్న్నెల రోజు ఇది వెన్నెల రోజు

చరణం::2 

జీవితం క్షణికమని చిచ్చుబుడ్డి చెబుతుంది
గువ్వల్లే బతకాలని తారాజువ్వ చెబుతుంది
నిప్పుతోటి చెలగాటం ముప్పుతెచ్చిపెడుతుందని 
తానందుకు సాక్ష్యమని టపాకాయ చెబుతుంది 

వెన్నెల రోజు ఇది వెన్నెల రోజు
అమావాస్య నాడు వచ్చే పున్నమి రోజు
దీపావళి రోజు దీపావళి రోజు
దీపావళి రోజు దీపావళి రోజు
దీపావళి రోజు దీపావళి రోజు
దీపావళి రోజు దీపావళి రోజు

ముహూర్త బలం--1969




సంగీతం::K.V.మహాదేవన్
రచన::ఆరుద్ర
గానం::P.సుశీల    
Film Directed By::M.Mallikaarjuna Rao  
తారాగణం::కృష్ణ,హరినాథ్,నాగభుషణం,నాగయ్యా,రాజబబు,అల్లురామలింగయ్య,రావికొండలరావు,జమున,సూర్యకాంతం,విజయనిర్మల,జ్యోతిలక్ష్మీ,రాజేశ్వరీ,ఉదయలక్ష్మీ.

పల్లవి::

అమ్మలగన్నా అమ్మల్లార..అక్షంతలు వేయండి వేయండి
హాస్యాలాడే ఆడపడుచులు..అమ్మా కొంచెం ఆగండి ఆగండీ

అమ్మలగన్నా అమ్మల్లార..అక్షంతలు వేయండి వేయండి
హాస్యాలాడే ఆడపడుచులు..అమ్మా కొంచెం ఆగండి ఆగండీ

ఆగం..ఆగం..ఆగం..హాస్యాలాడక..మానం..హాస్యాలాడక మానం

చరణం::1

తలబిరుసు పెళ్ళికుమార్తె..మెడలే వంచదట 
అవ్వవ్వ..అవ్వవ్వా..సిగ్గుబిడియం..అసలే లేవుసుమా
తాళిని కట్టించి ముకుతాడును..పొయ్యాలి..ఈఈఈ
తాళిని కట్టించి ముకుతాడును..పొయ్యాలి
మొగుడే రావాలీ..పొగరే తగ్గాలీ..ఈఈఈఈ 
అవును అవును అవును..పొగరే తగ్గాలి..పొగరే తగ్గాలీ

అమ్మలగన్నా అమ్మల్లార..అక్షంతలు వేయండి వేయండి
హాస్యాలాడే ఆడపడుచులు..అమ్మా కొంచెం ఆగండి ఆగండీ

చరణం::2

అసలైన మరదళ్ళంటే..అల్లరి బాజాలు
మురిపాల పరాసికాలు..ముళ్ళ రోజాలు
సందడి చేయాలీ..సరదా పండాలి..ఈఈఈఈ
సందడి చేయాలీ..సరదా పండాలి 
పందిట్లో అమ్మాయి..భరతం పట్టాలీ..ఈఈఈఈ 
అవును అవును అవును..భరతం పట్టాలీ భరతం పట్టాలీ

చరణం::3

గయ్యాళి నోటికి..తాళం టక్కున వేయాలి
తీరైన బుగ్గలు చిదిమి..దీపం పెట్టాలి
సిగ్గులు చిందాలీ..చిలిపిగ నవ్వాలీ..ఈఈఈఈ 
సిగ్గులు చిందాలీ..చిలిపిగ నవ్వాలీ
అందానికి దిష్టి తీసి..హారతి ఇవ్వాలీ..ఈఈఈఈ
అవును అవును అవును..హరతీ ఇవ్వాలి హారతీ ఇవ్వాలి 

అమ్మలగన్నా అమ్మల్లార..అక్షంతలు వేయండి వేయండి
హాస్యాలాడే ఆడపడుచులు..అమ్మా కొంచెం ఆగండి ఆగండీ


Muhurta Balam--1969
Music::K.V.Mahaadevan
Lyrics::Arudra
Singer::P.Suseela    
Film Directed By::M.Mallikaarjuna Rao 
Cast::Krishna,Harinaath,Nagabhushanam,Alluraamalingayya,Rajababu,Naagayya,Raavikondalarao,Jamuna,Vijayanirmala,Sooryakaantam,Jyothilakshmii,Raaeswarii,Udayabhanu.

::::::::::::::::::::::::::::::::::::

ammalagannaa ammallaara..akshantalu vEyanDi vEyanDi
haasyaalaaDE ADapaDuchulu..ammaa konchem AganDi AganDii

ammalagannaa ammallaara..akshantalu vEyanDi vEyanDi
haasyaalaaDE ADapaDuchulu..ammaa konchem AganDi AganDii

Agam..Agam..Agam..haasyaalaaDaka..maanam..haasyaalaaDaka maanam

::::1

talabirusu peLLikumaarte..meDalE vanchadaTa 
avvavva..avvavvaa..siggubiDiyam..asalE lEvusumaa
taaLini kaTTinchi mukutaaDunu..poyyaali..iiiiii
taaLini kaTTinchi mukutaaDunu..poyyaali
moguDE raavaalii..pogarE taggaalii..iiiiiiii 
avunu avunu avunu..pogarE taggaali..pogarE taggaalii

ammalagannaa ammallaara..akshantalu vEyanDi vEyanDi
haasyaalaaDE ADapaDuchulu..ammaa konchem AganDi AganDii

::::2

asalaina maradaLLanTE..allari baajaalu
muripaala paraasikaalu..muLLa rOjaalu
sandaDi chEyaalii..saradaa panDaali..iiiiiiii
sandaDi chEyaalii..saradaa panDaali 
pandiTlO ammaayi..bharatam paTTaalii..iiiiiiii 
avunu avunu avunu..bharatam paTTaalii bharatam paTTaalii

::::3

gayyaaLi nOTiki..taaLam Takkuna vEyaali
teeraina buggalu chidimi..deepam peTTaali
siggulu chindaalii..chilipiga navvaalii..iiiiiiii 
siggulu chindaalii..chilipiga navvaalii
andaaniki dishTi teesi..haarati ivvaalii..iiiiiiii
avunu avunu avunu..haratii ivvaali haaratii ivvaali 

ammalagannaa ammallaara..akshantalu vEyanDi vEyanDi
haasyaalaaDE ADapaDuchulu..ammaa konchem AganDi AganDii

Saturday, February 15, 2014

అగ్గిదొర--1967



సంగీతం::విజయా కృష్ణమూర్తి
రచన::G..కృష్ణమూర్తి
గానం::ఘంటసాల,P.సుశీల
తారాగణం::కాంతారావు,భారతి, విజయలలిత,ధూళిపాళ,సత్యనారాయణ బాలకృష్ణ

పల్లవి::

ఓ..తిరుమలేశా చాలు చాలీ సోధన
భరించలేనయ్యా మొరవిన వేమి..ఓ తిరుమలేశా

పిలిచిన పలికేవు స్వామీ
పిలిచిన పలికేవు స్వామీ..శిలగా నిలచేవేమీ..ఈ
పిలిచిన పలికేవు స్వామీ..శిలగా నిలచేవేమీ..ఈ
పిలిచిన పలికేవు స్వామీ..ఈ

చరణం::1

కాంతిని చూసే కన్నులలోనే..కన్నీరే..ఏ..నింపేవా
ఆ.....ఆ ఆ ఆ ఆ ఆ ఆ
కాంతిని చూసే కన్నులలోనే..కన్నీరే..ఏ..నింపేవా
ఏడువ చేసి..వేడుక చూసి..వేడుక చూసేవేమీ..ఈ
ఏడువ చేసి..వేడుక చూసి..వేడుక చేసేవేమీ..ఈ

పిలిచిన పలికేవు స్వామీ..ఈ..శిలగా నిలచేవేమీ
పిలిచిన పలికేవు స్వామీ..ఈ..శిలగా నిలచేవేమీ
పిలిచిన పలికేవు స్వామీ..ఈ

చరణం::2

మనిషిని చేసి..మనసును కోసి..మలినమునే..ఏ..నింపేవా
ఆ...ఆ ఆ ఆ ఆ ఆ ఆ
మనిషిని చేసి..మనసును కోసి..మలినమునే..ఏ..నింపేవా
పువ్వులలోనా..వాసన తోనే..పురుగుల నింపేవేమీ..ఈ
పువ్వులలోనా..వాసన తోనే..పురుగులనింపేవేమీ..ఈ

పిలిచిన పలికేవు స్వామీ..ఈ..శిలగా నిలచేవేమీ
పిలిచిన పలికేవు స్వామీ..ఈ

Thursday, February 13, 2014

ఒకరాధా-ఇద్దరుకృష్ణులు--1986



సంగీతం::ఇళయరాజ
రచన::వీటూరిసుందరరామమూర్తి
గానం::S.P.బాలు,S.జానకి
తారాగణం::కమల్‌హాసన్,శ్రీదేవి,రావుగోపాల్‌రావు,కైకాల సత్యనారాయణ,అల్లురామలింగయ్య,నూతన్‌ప్రసాద్,అన్నపూర్ణ,రాజేంద్రప్రసాద్,సుత్తివీరభద్రారావు,నిర్మలమ్మ,జయమాలిని,బిందు.

పల్లవి::

చిటుకు చిటుకు చిటుకు
చిటుకు చిటుకు చిటుకు
చిటుకు చిటుకు చిటుకు
చితాన్ చినుకు చినుకు
చిటుకు చిటుకు చిటుకు
చితాన్ చినుకు చినుకు

చిటుకు చిటుకు చిటుకు
చితాన్ చినుకు చినుకు
చిటుకు చిటుకు చిటుకు
చితాన్ చినుకు చినుకు..చ

పట్టుమరి పెట్టుమరి..ఓ ముద్దు
కంటతడి..పెట్టుకొనెలాగ
కొట్టుమరి..పట్టుమరి..ఓ కన్ను 
ఘొల్లుమని మొత్తుకొనెలాగా
మామ తిక్క కుదిరేదాకా
భామా నాకు చలిజ్వర చలేవరం

పట్టుమరి పెట్టుమరి..ఓ ముద్దు
అందరికి కంటబడెలాగా
తట్టుమరి పెట్‌మని నా వెన్ను 
ప్రేమ చలి తీర్చుకొనెలాగా

చరణం::1

చక్కని నీ చెక్కిలిని 
మెత్తగనే నొక్కుకొనె వేళా
సంధేవేళా..

చిక్కని నీ కౌగిలిలో
చిక్కుగనె చిక్కుకొనె వేళా చీకటేలా

ఇద్దరికి ఇష్టమైయ్యాకా అది
ఎందరికో కష్తమైయ్యాకా

ఎన్ని తమాషాలో..ఎన్ని తగాదాలో
ఈ ప్రేమ గాధలోనా
ఎన్ని తమాషాలో..ఎన్ని తగాదాలో
ఈ ప్రేమ గాధలోనా

రాధమ్మ సొగసరి..కృష్ణయ్య గడసరి
కాదంటే సరేసరి..కంసుళ్ళే హరిహరీ
సరే సరీ..హరిహరీ..సరే సరీ..హరిహరీ

పట్టుమరి పెట్టుమరి..ఓ ముద్దు
అందరికి కంటబడెలాగా..ఊమ్మహా    
తట్టుమరి పెట్‌మని నా వెన్ను 
ప్రేమ చలి తీర్చుకొనెలాగా
పొద్దు వాలిపోయేలోగ..హద్దె లేదు 
పదా పదా..మజా మజా

పట్టుమరి పెట్టుమరి..ఓ ముద్దు
కంటతడి..పెట్టుకొనెలాగ..అహా హ

చరణం::2

కాళ్ళబడే వేళ్ళబడే..అల్లరికి జాలిపడే
వేలా తాకిడేలా..ఆ

అంటుకుని ముట్టుకొని..జంటగనే కట్టుకొనె
వేళా..ఏడుపేలా..హా

ఇద్దరికి గిట్టుబడైతే..అది కొందరికి బెట్టుసరైతే
ఎన్ని మసాలాలో..ఎన్ని మజాకాలో
ఈ ప్రేమ గాధలోనా..ఆ
ఎన్ని మసాలాలో..ఎన్ని మజాకాలో
ఈ ప్రేమ గాధలోనా..ఆ

ముద్దుల్నే సరాసరి..ముద్రిస్తే సరేసరి
ముచ్చట్లే మరి మరీ..ముసలోళ్ళే హరి హరీ

సరే సరి హరి హరీ..సరే సరి హరి హరీ

పట్టుమరి పెట్టుమరి..ఓ ముద్దు
కంటతడి..పెట్టుకొనెలాగ
తట్టుమరి పెట్‌మని నా వెన్ను 
ప్రేమ చలి తీర్చుకొనెలాగా
మామ తిక్క కుదిరేదాక
భామా నాకు చలిజ్వరం చలేవరం

పట్టుమరి పెట్టుమరి..ఓ ముద్దు
అందరికి కంటబడెలాగా

అరె..కొట్టుమరి..పట్టుమరి..ఓ కన్ను 
ఘొల్లుమని మొత్తుకొనెలాగా..ఆహహహ

Okaraadhaa-Iddarukrshnulu--1986
Music::Ilayaraja
Lyrics::Veeturisundararaamamoorti
Singer's::S.P.Baalu,S.Jaanaki
Cast::::Kamal^Haasan,SreedEvi,RaavugOpaal^raavu,Kaikaala SatyanaaraayaNa,Alluraamalingayya,Nootan^Prasaad,AnnapoorNa,RaajEndraprasaad,Suttiveerabhadraaraavu,Nirmalamma,Jayamaalini,Bindu.

:::::::

chiTuku chiTuku chiTuku
chiTuku chiTuku chiTuku
chiTuku chiTuku chiTuku
chitaan chinuku chinuku
chiTuku chiTuku chiTuku
chitaan chinuku chinuku

chiTuku chiTuku chiTuku
chitaan chinuku chinuku
chiTuku chiTuku chiTuku
chitaan chinuku chinuku..cha

paTTumari peTTumari..O muddu
kanTataDi..peTTukonelaaga
koTTumari..paTTumari..O kannu 
ghollumani mottukonelaagaa
maama tikka kudirEdaakaa
bhaamaa naaku chalijwara chalEvaram

paTTumari peTTumari..O muddu
andariki kanTabaDelaagaa
taTTumari peT^mani naa vennu 
prEma chali teerchukonelaagaa

:::::1

chakkani nee chekkilini 
mettaganE nokkukone vELaa
sandhEvELaa..

chikkani nee kougililO
chikkugane chikkukone vELaa chiikaTElaa

iddariki ishTamaiyyaakaa adi
endarikO kashtamaiyyaakaa

enni tamaashaalO..enni tagaadaalO
ii prEma gaadhalOnaa
enni tamaashaalO..enni tagaadaalO
ii prEma gaadhalOnaa

raadhamma sogasari..kRshNayya gaDasari
kaadanTE sarEsari..kamsuLLE hariharii
sarE sarii..hariharii..sarE sarii..hariharii

paTTumari peTTumari..O muddu
andariki kanTabaDelaagaa..uummahaa    
taTTumari peT^mani naa vennu 
prEma chali teerchukonelaagaa
poddu vaalipOyElOga..hadde lEdu 
padaa padaa..majaa majaa

paTTumari peTTumari..O muddu
kanTataDi..peTTukonelaaga..ahaa ha

:::::2

kaaLLabaDE vELLabaDE..allariki jaalipaDE
vElaa taakiDElaa..aa

anTukuni muTTukoni..janTaganE kaTTukone
vELaa..EDupElaa..haa

iddariki giTTubaDaitE..adi kondariki beTTusaraitE
enni masaalaalO..enni majaakaalO
ii prEma gaadhalOnaa..aa
enni masaalaalO..enni majaakaalO
ii prEma gaadhalOnaa..aa

muddulnE saraasari..mudristE sarEsari
muchchaTlE mari marii..musalOLLE hari harii

sarE sari hari harii..sarE sari hari harii

paTTumari peTTumari..O muddu
kanTataDi..peTTukonelaaga
taTTumari peT^mani naa vennu 
prEma chali teerchukonelaagaa
maama tikka kudirEdaaka
bhaamaa naaku chalijwaram chalEvaram

paTTumari peTTumari..O muddu
andariki kanTabaDelaagaa

are..koTTumari..paTTumari..O kannu 
ghollumani mottukonelaagaa..aahahaha

Tuesday, February 11, 2014

చండీప్రియ--1980


సంగీతం::ఆదినారాయణరావ్ సత్య 
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::P.సుశీల,బృందం 
తారాగణం::చిరంజీవి,జయప్రద,శోభన్‌బాబు 

పల్లవి::

శ్రీ భాగ్య రేఖ ఉపపాదయంతి ఆ ఆ ఆ ఆ ఆ ఆ
శివంకరి సింధుర మందయాన..ఆ ఆ ఆ ఆ
శ్రీ భాగ్య రేఖ ఉపపాదయంతి..ఈ
శివంకరి సింధుర మందయాన..ఆ  
శీతాంషబింభం ప్రతి మానవత్ర 
సితబ్ది పుత్రి శిరసా..నమామి శిరసా..నమామి 

జనని జనని జననీ..నవ లావణ్య వాహిని మోహిని
జనని జనని జననీ..ఈఈఈ 
శరణం నీ చరణం..శరణం నీ చరణం  
శ్రీకరి..బవహరి..గౌరీ శాంకరి  
శరణం నీ చరణం..శరణం నీ చరణం 

శరణం..కడవాలని..సిరమిడి పూజించని..ఈఈఈ   
శరణం..కడవాలని..సిరమిడి పూజించని  
జనని జనని జననీ..ఈఈఈ 

నటియించే నీ కాలి అందియల గంటల గణ గణ లేవి దేవి
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ 
చలియించే..నీ కేళి కంకనపు మువ్వల సవ్వడులేవి దేవి
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ   
ఊగి తూగే సిగ పాయలలో తురిమిన తారకలేవి దేవి  
ఆ సుందర సుమధుర రూపం 
ఈ చండి ప్రియ హృదయ దీపం 
సుమ మృదుహాసిని..సుమధుర బాషిని 
సువర్ణపీటాద్యాసిని..జననీ జననీ జననీ..ఈఈఈ 
శరణం నీ చరణం..శరణం నీ చరణం 
శ్రీకరి..బవహరి..గౌరీ శాంకరి 
శరణం నీ చరణం..జననీ జననీ జననీ..ఈఈఈ 

  
మెడలో కదిలే సర్పహరములు 
పొగడసరాలుగా మార్చిన దేవి  
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ 
జ్వలియించె నీ పాలనేత్రమును 
అరుణ తిలకముగా మార్చిన దేవి 
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ 
ఎంత చల్లని తల్లివో కాని   
వింతలు వింతలు నీ చేతలూ 
ఆ మధుర మధుర దరహాసం 
ఆ మంజుల నాట్య విలాసం  
సుమ మృదుహాసిని ...సుమధుర బాషిని 
సువర్ణపీటాద్యాసిని..జననీ జననీ జననీ
నవ లావణ్య వాహిని మోహిని
జనని జనని జననీ..ఈఈఈఇ
శరణం నీ చరణం..శరణం నీ చరణం 
శ్రీకరి..బవహరి..గౌరీ శాంకరి 
శరణం నీ చరణం..శరణం నీ చరణం

Wednesday, February 05, 2014

గౌరి--1974



సంగీతం::సత్యం
రచన::ఆత్రేయ 
గానం::S.P.బాలు,P.సుశీల 
తారాగణం::కృష్ణ,జమున,రాజబాబు,శుభ,అల్లు రామలింగయ్య,రావు గోపాలరావు

పల్లవి::

ఈదితే గోదారి ఈదాలీ..ఏలితే గౌరినే ఏలాలీ
ఈదితే గోదారి ఈదాలీ..ఏలితే గౌరినే ఏలాలీ 
చేరితే నీ చెంత చేరాలీ..చేతిలో చెయ్యెసి నడవాలీ    
చేరితే నీ చెంత చేరాలీ..చేతిలో చెయ్యెసి నడవాలీ    

చరణం::1

కళ్ళల్లో కళ్ళెట్టి చూడాలీ..కమ్మకమ్మనీ కబుర్లాడుకోవాలీ
కళ్ళల్లో కళ్ళెట్టి చూడాలీ..కమ్మకమ్మనీ కబుర్లాడుకోవాలీ
కలలతో పనిలేకపోవాలీ..ఇంక కలలతో పనిలేకపోవాలీ
మనకు కాలమంటె..తెలియకుండ గడవాలీ     
ఈదితే గోదారి ఈదాలీ..ఏలితే గౌరినే ఏలాలీ 
చేరితే నీ చెంత చేరాలీ..చేతిలో చెయ్యెసి నడవాలీ    

చరణం::2

పడవలో గడవేస్తూ...నువ్వుంటే
నా పైట చెంగు తెరచాపై ఎగురుతుంటే
పడవలో గడవేస్తూ...నువ్వుంటే
నా పైట చెంగు తెరచాపై ఎగురుతుంటే
ఒప్పలేని సూరీడు...చల్లబడాలీ
ఒప్పలేని సూరీడు...చల్లబడాలీ  
ఆ..చుప్పనాతి సెందురుడు వుడికిపోవాలీ   
ఈదితే గోదారి ఈదాలీ..ఏలితే గౌరినే ఏలాలీ 
చేరితే నీ చెంత చేరాలీ..చేతిలో చెయ్యెసి నడవాలీ    

చరణం::3

వయసేమో వరదలై వురకాలీ..వలపు వంతెనతో దాన్ని మనం గెలవాలీ 
వయసేమో వరదలై వురకాలీ..వలపు వంతెనతో దాన్ని మనం గెలవాలీ 
జనం కన్నులన్ని మనజంటే చూడాలీ..జనం కన్నులన్ని మనజంటే చూడాలీ  
వచ్చే జన్మలన్ని యిద్దరమే...జతగావాలీ    
ఈదితే గోదారి ఈదాలీ...ఏలితే గౌరినే ఏలాలీ 
చేరితే నీ చెంత చేరాలీ...చేతిలో చెయ్యెసి నడవాలీ