Tuesday, February 25, 2014

అశోక చక్రవర్తి--1993



















సంగీతం::ఇళయరాజా
రచన::వీటూరి 
గానం::S.P.బాలు , S.జానకి
తారాగణం::బాలకృష్ణ,భానుప్రియ. 

పల్లవి::

ఎందరో మహానుభావులు..ఒక్కరికే వందనము 
ఎందరో మహానుభావులు..ఒక్కరికే వందనము
ఒడినే గుడిగా మలచి..తమనే వలచి..పిలిచే..వేళ

ఎందరో మహానుభావులు..సుందరికే బంధనము
ఎందరో మహానుభావులు..సుందరికే బంధనము
ఎదలా ఎదుటే నిలిచి..వలపై..ఇలపై..నిలిచే..వేళ
ఎందరో మహానుభావులు..ఒక్కరికే వందనము

చరణం::1

నీ రాధనేరా..ఆడాలిరా రాసలీల
శ్రీకృష్ణుడల్లే వస్తానులే..వేసి ఈల
నీకెందుకా దేవి పూజ..నేనుండగ బ్రహ్మచారి
పూజారినే వలచుటేల..ఈ దేవతే కాలుజారి
అందుకో..మహానుభావుడా కౌగిలినే కానుకగా
ఆపవే బాలికా..చాలికా
ఎందరో మహానుభావులు..ఒక్కరికే వందనం
ఎందరో మహానుభావులు..సుందరికే బంధనము

చరణం::2

నీ కొంగు జారి..శృంగారమే ఆరబోసే
నీ దొంగ చూపే..నా లేత ప్రాణలు తీసే
నిన్నంటుకున్నాక రేయి..కన్నంటుకోనంది బాలా
గుళ్ళోకి నే తెచ్చుకుంటే..మెళ్ళోకి చేరింది మాల
అందుకే వరించు ఘాటుగా..కిమ్మనకా..పొమ్మనక
ఆపరా..నా దొర..తొందరా
ఎందరో మహానుభావులు..సుందరికే బంధనము
ఎందరో మహానుభావులు..ఒక్కరికే వందనం
ఒడినే గుడిగా మలచి..తమనే వలచి..పిలిచే..వేళ
ఎందరో మహానుభావులు..సుందరికే బంధనము

No comments: