Wednesday, February 05, 2014

గౌరి--1974

సంగీతం::సత్యం
రచన::ఆత్రేయ 
గానం::S.P.బాలు,P.సుశీల 
తారాగణం::కృష్ణ,జమున,రాజబాబు,శుభ,అల్లు రామలింగయ్య,రావు గోపాలరావు

పల్లవి::

ఈదితే గోదారి ఈదాలీ..ఏలితే గౌరినే ఏలాలీ
ఈదితే గోదారి ఈదాలీ..ఏలితే గౌరినే ఏలాలీ 
చేరితే నీ చెంత చేరాలీ..చేతిలో చెయ్యెసి నడవాలీ    
చేరితే నీ చెంత చేరాలీ..చేతిలో చెయ్యెసి నడవాలీ    

చరణం::1

కళ్ళల్లో కళ్ళెట్టి చూడాలీ..కమ్మకమ్మనీ కబుర్లాడుకోవాలీ
కళ్ళల్లో కళ్ళెట్టి చూడాలీ..కమ్మకమ్మనీ కబుర్లాడుకోవాలీ
కలలతో పనిలేకపోవాలీ..ఇంక కలలతో పనిలేకపోవాలీ
మనకు కాలమంటె..తెలియకుండ గడవాలీ     
ఈదితే గోదారి ఈదాలీ..ఏలితే గౌరినే ఏలాలీ 
చేరితే నీ చెంత చేరాలీ..చేతిలో చెయ్యెసి నడవాలీ    

చరణం::2

పడవలో గడవేస్తూ...నువ్వుంటే
నా పైట చెంగు తెరచాపై ఎగురుతుంటే
పడవలో గడవేస్తూ...నువ్వుంటే
నా పైట చెంగు తెరచాపై ఎగురుతుంటే
ఒప్పలేని సూరీడు...చల్లబడాలీ
ఒప్పలేని సూరీడు...చల్లబడాలీ  
ఆ..చుప్పనాతి సెందురుడు వుడికిపోవాలీ   
ఈదితే గోదారి ఈదాలీ..ఏలితే గౌరినే ఏలాలీ 
చేరితే నీ చెంత చేరాలీ..చేతిలో చెయ్యెసి నడవాలీ    

చరణం::3

వయసేమో వరదలై వురకాలీ..వలపు వంతెనతో దాన్ని మనం గెలవాలీ 
వయసేమో వరదలై వురకాలీ..వలపు వంతెనతో దాన్ని మనం గెలవాలీ 
జనం కన్నులన్ని మనజంటే చూడాలీ..జనం కన్నులన్ని మనజంటే చూడాలీ  
వచ్చే జన్మలన్ని యిద్దరమే...జతగావాలీ    
ఈదితే గోదారి ఈదాలీ...ఏలితే గౌరినే ఏలాలీ 
చేరితే నీ చెంత చేరాలీ...చేతిలో చెయ్యెసి నడవాలీ

No comments: