Tuesday, March 12, 2013

మనుషుల్లో దేవుడు--1974::హంసధ్వని::రాగం


సంగీతం::హనుమంతరావు 
రచన::దాశరధి 
గానం::S.జానకి 
శ్రీ భాస్కర చిత్ర వారి
దర్శకత్వం::B.V.ప్రసాద్
తారాగణం::N.T.రామారావు,వాణిశ్రీ,గుమ్మడి,B.సరోజాదేవి,కృష్ణంరాజు,విజయలలిత,అంజలిదేవి,
హంసధ్వని::రాగం

పల్లవి::

గోపాలనను పాలింప రావా
గోపాలనను పాలింప రావా
బృందావనిలో వేచితిరావా
బృందావనిలో వేచితిరావా
గోపాలనను పాలింప రావా

చరణం::1

పొన్నల నీడ వెన్నెల వాడ
నిన్నే వెదికె నీ రాధనురా

పొన్నల నీడ వెన్నెల వాడ
నిన్నే వెదికె నీ రాధనురా
మురళీలోలా మోహన బాలా
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ 
మురళీలోలా మోహన బాలా
జాలము నీకేల కేళీ విలోలా 

గోపాలనను పాలింప రావా
బృందావనిలో వేచితిరావా
గోపాలనను పాలింప రావా

చరణం::2

పిల్లన గ్రోవి మెల్లగ వూది
అల్లరి చేసే నల్లని స్వామీ
పిల్లన గ్రోవి మెల్లగ వూది
అల్లరి చేసే నల్లని స్వామీ
వినేపడుటేనా..కనపడరావా
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ 
వినేపడుటేనా..కనపడరావా
నీ రాగసుధలందు తేలించరారా 

గోపాలనను పాలింప రావా
బృందావనిలో వేచితిరావా
గోపాలనను పాలింప రావా

చరణం::3

గలగల లాడే యమునా నదిలో
ఊయల లూగే పూలనావలో
కాలము మరచీ లోకము విడిచీ
కాలము మరచీ లోకము విడిచీ
నీ దివ్య చరణాల నివశించ నీరా

గోపాలనను పాలింప రావా
బృందావనిలో వేచితిరావా
గోపాలనను పాలింప రావా

No comments: