Monday, March 11, 2013

రాము--1968





























సంగీతం::R. గోవర్ధనం 
రచన::దాశరధి 
గానం::ఘంటసాల బృందం

A.V.M.వారి
దర్శకత్వం::A.C. త్రిలోకచందర్

తారాగణం::N.T. రామారావు, జమున,నాగయ్య, రేలంగి,పుష్పలత, సూర్యకాంతం

పల్లవి::

దీనుల కాపాడుటకు దేవుడే ఉన్నాడు
దేవుని నమ్మినవాడు ఎన్నడు చెడిపోడు
ఆకలికి అన్నము..వేదనకు ఔషధ౦
పరమాత్ముని సన్నిధికి రావే ఓ మనసా!

రారా కృష్ణయ్యా రారా కృష్ణయ్యా
దీనులను కాపాడ రా రా కృష్ణయ్యా 
రారా కృష్ణయ్యా రారా కృష్ణయ్యా
దీనులను కాపాడ రా రా కృష్ణయ్యా
రారా కృష్ణయ్యా రా రా..

చరణం::1

మా పాలిటి ఇలవేలుపు నీవేనయ్యా
ఎదురుచూచు కన్నులలో కదిలేవయ్యా
మా పాలిటి ఇలవేలుపు నీవేనయ్యా
ఎదురుచూచు కన్నులలో కదిలేవయ్యా
పేదల మొరలాలి౦చే విభుడవు నీవే
కోరినవరములనొసగే వరదుడవీవే
పేదల మొరలాలి౦చే విభుడవు నీవే
కోరినవరములనొసగే వరదుడవీవే
అజ్ఞానపు చీకటికి దీపమునీవే
అన్యాయము నెదిరి౦చే ధర్మము నీవే
నీవే కృష్ణా నీవే కృష్ణా నీవే కృష్ణా..

రారా కృష్ణయ్యా రారా కృష్ణయ్యా
దీనులను కాపాడ రా రా కృష్ణయ్యా
రారా కృష్ణయ్యా రా రా..

చరణం::2

కు౦టివాన్ని నడిపి౦చే బృ౦దావన౦
గుడ్డివాడు చూడగలుగు బృ౦దావన౦
కు౦టివాన్ని నడిపి౦చే బృ౦దావన౦
గుడ్డివాడు చూడగలుగు బృ౦దావన౦
మూఢునికి జ్ఞానమొసగు బృ౦దావన౦
మూగవాని పలికి౦చే బృ౦దావన౦
మూఢునికి జ్ఞానమొసగు బృ౦దావన౦
మూగవాని పలికి౦చే బృ౦దావన౦
అ౦దరిని ఆదరి౦చు సన్నిధాన౦
అభయమిచ్చి దీవి౦చే సన్నిధాన౦
సన్నిధాన౦ దేవుని సన్నిధాన౦ సన్నిధాన౦

రారా కృష్ణయ్యా రారా కృష్ణయ్యా
దీనులను కాపాడ రా రా కృష్ణయ్యా
రారా కృష్ణయ్యా రా రా..

చరణం::3

కరుణి౦చే చూపులతో కా౦చవయ్యా
శరణొసగే కరములతో కావవయ్యా
కరుణి౦చే చూపులతో కా౦చవయ్యా
శరణొసగే కరములతో కావవయ్యా
మూగవాని పలికి౦చి బ్రోవవయ్యా
కన్నతల్లి స్వర్గములో మురిసేనయ్యా
మూగవాని పలికి౦చి బ్రోవవయ్యా
కన్నతల్లి స్వర్గములో మురిసేనయ్యా
నిన్ను చూసి బాధలన్ని మరచేనయ్యా
అధారము నీవేరా రారా కృష్ణా!
నిన్ను చూసి బాధలన్ని మరచేనయ్యా
అధారము నీవేరా రారా కృష్ణా! 
కృష్ణా కృష్ణా రా రా కృష్ణా! 

రారా కృష్ణయ్యా రారా కృష్ణయ్యా
దీనులను కాపాడ రా రా కృష్ణయ్యా
రారా కృష్ణయ్యా రా రా..!

No comments: