సంగీత::సత్యం
రచన::కొసరాజు రాఘవయ్య
గానం::S.P.బాలు,L.R.ఈశ్వరి
తారాగణం::కృష్ణ,శోభన్‌బాబు,సావిత్రి,లక్ష్మి,చంద్రకళ,రమాప్రభ,రాజబాబు,నాగయ్య
పల్లవి::
జమాలంగిడీ జంకా బొగ్గుల్లో రామచిలకా
జమాలంగిడీ జంకా బొగ్గుల్లో రామచిలకా
నిను చూస్తేనే చెడ్డ కాక అరె
ఛీ..ఛీ..పోవే..నోరెత్తక..ఛీ
నే చేసిన పాపం ఏంది..నా మీద కోపం ఏంది
నే చేసిన పాపం ఏంది..నా మీద కోపం ఏంది
తాళికట్టిన పెళ్లాన్ని..నువ్వు తిట్టినాసరే నీదాన్ని
జమాలంగిడీ జంకా..అసలైన రామచిలకా
జమాలంగిడీ జంకా..అసలైన రామచిలకా
ఎందుకయ్యా ఇంతకాక..ఓయ్..అమ్మ బాబో..తిట్టమాక
మొఖమ్మీద రుద్దుకోవు పౌడరైనా
లిప్ స్టిక్ దిద్దుకోవు పెదవులపైన
ఇది శుద్ద నాటు సరుకు ఇంకొద్దు బాబు నాకు
నా ఖర్మకొద్ది దొరికావే కొరివి దెయ్యమా..పోపోవే
ఒరేయ్ జంబలకర పంబ..హా..మామా..రక్షింపుము..రక్షింపుము
జంబలకర పంబర అరె పలుకుతుంది అంబ
జంబలకర పంబ అరె పలుకుతుంది అంబ
ఏందిరయ్య యీ గోల..కాస్త సర్దుకుంటే మేలు చాల
ఈ మొద్దు రాచిప్పతోటి ఎలా కాపరం
ముద్దూ ముచ్చట సరదా ఏలా తీరడం
మొద్దు నా ఆ సుద్ద మొద్దునా అవును
ఆ చెప్పవా మనసు విప్పవా
ఛీ..ఈ మొద్దు రాచిప్పతో ఎలా కాపరం
ముద్దూ ముచ్చట సరదా ఏలా తీరడం
గౌనేసుకున్నదాన్ని దొరసాని పోజుదాన్ని
గౌనేసుకున్నదాన్ని..దొరసాని పోజుదాన్ని
నే కోరి తెచ్చుకుంటా దీన్నసలు వదులుకుంటా
జమాలంగిడీ జంకా బొగ్గుల్లో రామచిలకా
నిను చూస్తేనే చెడ్డ కాక ఛీ..అరే..ఛీ..పోవే నోరెత్తక
ఒరే..కొడకా..
మగవాళ్ళ ఆటలింక సాగవురా
పెళ్లిమీద పెళ్ళి పెద్ద డేంజరురా
మగవాళ్ళ ఆటలింక సాగవురా
ఈ పెళ్లిమీద పెళ్ళి పెద్ద డేంజరురా
ఆ పప్పులిప్పుడుడకవురా పైన కోర్టులున్నవిరా
పప్పులిప్పుడుడకవురా..పైన కోర్టులున్నవిరా
రాజమండ్రి జైలు నీకు రాసిపెట్టి వుందిరా
జంబలకర పంబ అరె పలుకుతుంది అంబ
జంబలకర పంబ అరె పలుకుతుంది అంబ
ఏందిరయ్య యీ గోల కాస్త సర్దుకుంటే మేలు చాల
No comments:
Post a Comment