Thursday, November 22, 2012

ప్రేమించు పెళ్ళాడు--1985


సంగీతం::ఇళయ రాజా 
రచన::వేటూరి సుందర రామూర్తి   
గానం::S.P.బాలు, S.జానకి 
Film Directed By::Vamshi
తారాగణం::రాజేంద్ర ప్రసాద్,భానుప్రియ,తులసి,కైకాల సత్యనారాయణ.
పల్లవి:: 

నిరంతరమూ వసంతములే
మందారముల మరందములే
స్వరాలు సుమాలుగ పూచే
పదాలు ఫలాలుగ పండే

చరణం::1

హాయిగా పాట పాడే కోయిలే మాకు నేస్తం
తేనెలో తానమాడే తుమ్మెదే మాకు చుట్టం 
నదులలో వీణ మీటే తెమ్మెరే మాకు ప్రాణం
అలలపై నాట్యమాడే వెన్నెలే వేణు గానం
ఆకశానికవి తారలా..
ఆశకున్న విరి దారులా
ఈ సమయం ఉషోదయమై
మా హృదయం జ్వలిస్తుంటే


చరణం::2

అగ్ని పత్రాలు రాసి గ్రీష్మమే సాగిపోయే
మెరుపు లేఖల్లు రాసే మేఘమే మూగవోయె
మంచు ధాన్యాలు కొలిచి పౌష్యమే వెళ్ళిపోయే 
మాఘ దాహాలలోన అందమే అత్తరాయే
మల్లె కొమ్మ 
చిరునవ్వులా..
మనసులోని మరుదివ్వెలా..
ఈ సమయం రసోదయమై..
మా ప్రణయం ఫలిస్తుంటే

నిరంతరమూ వసంతములే
మందారముల మరందములే
స్వరాలు సుమాలుగ పూచే
పదాలు ఫలాలుగ పండే

No comments: