సంగీతం::ఇళయ రాజా
రచన::వేటూరి సుందర రామూర్తి
గానం::S.P.బాలు, P.సుశీల
Film Directed By::Vamshi
తారాగణం::రాజేంద్ర ప్రసాద్,భానుప్రియ,తులసి,కైకాల సత్యనారాయణ.
పల్లవి::
వయ్యారి గోదారమ్మా..ఒళ్ళంతా ఎందుకమ్మా కలవరం
కడలి ఒడిలో కలిసిపోతే కల వరం..
ఇన్ని కలలిక ఎందుకో..కన్నే కలయిక కోరుకో..
కలవరింతే కౌగిలింతై..
వయ్యారి గోదారమ్మా..ఒళ్ళంతా ఎందుకమ్మా కలవరం
చరణం::1
నిజము నా స్వప్నం..హొ..హొ..
కలనో..హొ..హొ..లేనో..హొ..హొ..హొ..
నీవు నా సత్యం..హొ..హొ..కానో..హొ..హొ..హొ
ఊహ నీవే..ఆ హ హాహ..ఉసురు కారాదా..ఆహా
మోహమల్లే..ఆ హ హాహ..ముసురుకోరాదా..ఆహా..
నవ్వేటి నక్షత్రాలు మువ్వల్ని ముద్దాడంగ మువ్వగోపాలుని రాధికా..
ఆకాశ వీణ గీతాలలోన..ఆలాపనై నే కరిగిపోనా...............
వయ్యారి గోదారమ్మా..ఒళ్ళంతా ఎందుకమ్మా కలవరం
చరణం::2
తందాన తాననన..తందాన తాననన..నా..
తందాన తాననన..తందాన తాననన..
తాకితే తాపం..హొ..హొ..
కమలం..హొ..హొ..భ్రమరం..హొ..హొ..హొ
సోకితే మైకం..హొ..హొ..
అధరం..హొ..హొ..అధరం..హొ..హొ..హొ
ఆటవెలది..ఆ హ హహ..ఆడుతూ రావే..ఆహా..
తేటగీతి..ఆహ హాహ..తేలిపోనీవే..ఆహా..
పున్నాగ కోవెల్లోన పూజారి దోసిళ్ళన్ని యవ్వనాలకు కానుక..
చుంబించుకున్న బింబాధరాల సూర్యోదయాలే పండేటి వేళ..
వయ్యారి గోదారమ్మా..ఒళ్ళంతా ఎందుకమ్మా కలవరం..
కడలి ఒడిలో కలిసిపోతే కల వరం..
ఇన్ని కలలిక ఎందుకో..కన్నే కలయిక కోరుకో..
కలవరింతే కౌగిలింతై..
వయ్యారి గోదారమ్మా..ఒళ్ళంతా ఎందుకమ్మా కలవరం
No comments:
Post a Comment