Sunday, September 23, 2012

అక్కాచెల్లెలు--1970

సంగీతం::K.V.మహదేవన్
రచన::ఆచార్య ఆత్రేయ 
గానం::ఘంటసాల,P.సుశీల
Film Directed By::Akkineni Sanjeevi
తారాగణం::అక్కినేని,జానకి,కృష్ణ,విజయనిర్మల,గుమ్మడి,పద్మనాభం,రమాప్రభ,శాంతకుమారి,విజయలలిత,అల్లురామలింగయ్య,ప్రభాకర్ రెడ్డి,చిత్తూర్‌నాగయ్య
పల్లవి::

చిటాపటా చినుకులతో కురిసింది వాన మెరిసింది జాణ
చిటాపటా చినుకులతో కురిసింది వాన మెరిసింది జాణ
చిటాపటా చినుకులతో

తళాతళా మెరుపులతో మెరిసింది పైన ఉరిమింది లోన
తళాతళా మెరుపులతో మెరిసింది పైన ఉరిమింది లోన
తళాతళా మెరుపులతో

చరణం::1

వచ్చే వచ్చే వానజల్లు..వచ్చే వచ్చే వానజల్లు
జల్లు కాదది పొంగివచ్చు..పడుచుదనం వరదలే అది
జల్లు కాదది పొంగివచ్చు..పడుచుదనం వరదలే అది
వరద కాదది ఆగలేని..చిలిపితనం వాగులే అది
నీ వేగమే ఇది..

కురిసింది వాన మెరిసింది జాణ...
చిటాపటా చినుకులతో కురిసింది వాన మెరిసింది జాణ
చిటాపటా చినుకులతో

చరణం::2

నల్లమబ్బు తెల్లమబ్బు..ముద్దులాడుకున్నవి
చుక్కలన్ని చీకట్లో..ముసుగు కప్పుకున్నవి
నల్లమబ్బు తెల్లమబ్బు..ముద్దులాడుకున్నవి
చుక్కలన్ని చీకట్లో..ముసుగు కప్పుకున్నవి
ఉల్లిపొర చీర తడిసి..ఒంటికంటుకున్నది
ఉల్లిపొర చీర తడిసి..ఒంటికంటుకున్నది

తళాతళా మెరుపులతో మెరిసింది పైన ఉరిమింది లోన
తళాతళా మెరుపులతో

చరణం::3

మెరిసె మెరిసె రెండు కళ్లు..మెరిసె మెరిసె రెండు కళ్లు
కళ్లు కావవి మనసులోకి తెరిచిన వాకిళ్ళులే అవి
కళ్లు కావవి మనసులోకి తెరిచిన వాకిళ్ళులే అవి
వాకిళ్ళు కావవి వలపు తేనెలూరే రసగుళ్లులే అవి
సెలయేళ్లులే ఇవి
మెరిసింది పైన ఉరిమింది లోన

తళాతళా మెరుపులతో మెరిసింది పైన ఉరిమింది లోన
చిటాపటా చినుకులతో కురిసింది వాన మెరిసింది జాణ
చిటాపటా చినుకులతో

No comments: