సంగీతం::మాస్టర్ వేణు
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::ఘంటసాల
పల్లవి::
ఎవరికీ తలవంచకు..
ఎవరినీ యాచించకు
గుండెబలమే నీ ఆయుధం..
నిండుమనసే నీ ధనం
ఎవరికీ తలవంచకు..
ఎవరినీ యాచించకు
చరణం::1
కండలు పిండే కష్టజీవులకు
తిండికి కరువుంటుందా?
కండలు పిండే కష్టజీవులకు
తిండికి కరువుంటుందా?
నిజాయితీకై నిలిచేవారికి
పరాజయం ఉంటుందా?
మంచితనమ్మును మించిన పెన్నిధి
మంచితనమ్మును మించిన పెన్నిధి
మనిషికి వేరే ఉందా?..మనిషికి వేరే ఉందా?
ఎవరికీ తలవంచకు..
ఎవరినీ యాచించకు
చరణం::2
చాలీచాలని జీతంతో
మిడిమేలపు కొలువులు కొలవకు
చాలీచాలని జీతంతో
మిడిమేలపు కొలువులు కొలవకు
ముడుచుకుపోయిన ఆశలతో..హోయ్
మిడిమిడి బ్రతుకును గడపకు
ముడుచుకుపోయిన ఆశలతో..హోయ్
మిడిమిడి బ్రతుకును గడపకు
చీకటి రాజ్యం ఎంతోకాలం
చెలాయించదని మరవకు
చెలాయించదని మరవకు
ఎవరికీ తలవంచకు..
ఎవరినీ యాచించకు
చరణం::3
జీవితమే ఒక వైకుంఠపాళి
నిజం తెలుసుకో భాయీ
జీవితమే ఒక వైకుంఠపాళి
నిజం తెలుసుకో భాయీ
ఎగరేసే నిచ్చెనలే కాదు
పడదోసే పాములు ఉంటాయి
చిరునవ్వులతో విషవలయాలను
ఛేదించి ముందుకు పదవోయి
ఛేదించి ముందుకు పదవోయి
ఎవరికీ తలవంచకు..
ఎవరినీ యాచించకు
గుండెబలమే నీ ఆయుధం..
నిండుమనసే నీ ధనం
ఎవరికీ తలవంచకు..
ఎవరినీ యాచించకు
No comments:
Post a Comment