సంగీతం::చక్రవర్తి
రచన::వేటూరి
గానం::S.P.బాలు,P.సుశీల
Film Directed by::K.Raghavendra Rao
తారాగణం::N.T.రామారావు,జయంతి,శ్రీదేవి కపూర్,మోహన్‌బాబు,గీత,రావ్‌గోపాల్‌రావ్,
కైకాల.సత్యనారాయణ,అల్లురామలింగయ్య,నాగేష్,చలపతిరావ్,సుత్తివీరభద్రరావ్,జగ్గారావ్.
పల్లవి::
బంగినపల్లి మామిడి పండు రంగు మీదుంది
చిలకే ముట్టని జాంపండు సిగ్గు పడుతుంది
బంగినపల్లి మామిడి పండు రంగు మీదుంది
చిలకే ముట్టని జాంపండు సిగ్గు పడుతుంది
అది ఏ తొటదో ఏ పేటదో అది ఏ తొటదో ఏ పేటదో
బంగినపల్లి మామిడి పండు కోత కొచ్చింది
చిలకే నువ్వని జాంపండు చేతికొచ్చింది
బంగినపల్లి మామిడి పండు కోత కొచ్చింది
చిలకే నువ్వని జాంపండు చేతికొచ్చింది
ఇది నీ కొసమే పండిందిలే ఇది నీ కొసమే పండిందిలే
చరణం::1
మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్హు..హ్హా హ్హా హ్హా..
పెదవులా రెండు దొండపళ్ళూ
ఆ ఆ ఆ ఆ ఆ ఆ
చెక్కిళ్ళా చక్కెరకేళి అరటి పళ్ళు
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
నీలికన్ను నేరేడు పండు
నీలికన్ను నేరేడు పండు
నిన్ను చూసి నా ఈడు పండు
పాలకొల్లు తొటలోన బత్తాయిలు
వలపుల్ల వడ్లమూడి నారింజలు
పాలకొల్లు తొటలోన బత్తాయిలు
వలపుల్ల వడ్లమూడి నారింజలు
కొత్తపల్లి కొబ్బరంటి చలి కోర్కెలు
తొలి చూపుకొచ్చాయి నీ చూపులు
ఈ మునిమాపులు.....
బంగినపల్లి మామిడి పండు రంగు మీదుంది
చిలకే ముట్టని జాంపండు సిగ్గు పడుతుంది
ఇది నీ కొసమే పండిందిలే ఇది నీ కొసమే పండిందిలే
చరణం::2
పలుకులా తేనె పనసపళ్ళు
ఆ ఆ ఆ ఆ
తళుకులా పచ్చ దబ్బ పళ్ళు
హహా ఆహహా
నీకు నేను దానిమ్మ పండు
నీకు నేను దానిమ్మ పండు
అరె నూజివీడు సరసాల సందిళ్ళ లో
సరదా సపోటాల సయ్యాటలో
నూజివీడు సరసాల సందిళ్ళ లో
సరదా సపోటాల సయ్యాటలో
చిత్తూరు మామిళ్ళ చిరువిందులే
అందించుకోవాలి అరముద్దులు మన సరిహద్దులు
బంగినపల్లి మామిడి పండు కోత కొచ్చింది
చిలకే నువ్వని జాంపండు చేతికొచ్చింది
ఇది నీ కొసమే పండిందిలే ఇది నీ కొసమే పండిందిలే
అరే బంగినపల్లి మామిడి పండు రంగు మీదుంది
చిలకే ముట్టని జాంపండు సిగ్గు పడుతుంది
అది ఏ తొటదో ఏ పేటదో అది ఏ తొటదో ఏ పేటదో
No comments:
Post a Comment