Monday, September 17, 2012

గుండమ్మ కథ--1962



సంగీతం::ఘంటసాల
రచన::పింగళి నాగేంద్ర రావు
గానం::ఘంటసాల, P.లీల

తారాగణం::N.T.రామారావు,అక్కినేని,జమున,సావత్రి,S.V.రంగారావు,రాజనాల,రమణారెడ్డి,L.విజయలక్ష్మి,
హరనాధ్, ఛాయాదేవి.

పల్లవి::


వేషము మార్చెను..హోయ్
భాషను మార్చెను..హోయ్
మోసము నేర్చెనూ..ఊఊఊఊ
అసలు తానే మారెను..ఊఊ

అయినా మనిషి మారలేదు
ఆతని మమత తీరలేదు
మనిషి మారలేదు
ఆతని మమత తీరలేదు
మనిషి మారలేదు
ఆతని మమత తీరలేదు

చరణం::1

క్రూరమృగమ్ముల కోరలు తీసెను
ఘోరారణ్యములాక్రమించెను
క్రూరమృగమ్ముల కోరలు తీసెను
ఘోరారణ్యములాక్రమించెను

హిమాలయముపై జండా పాతెను
హిమాలయముపై జండా పాతెను
ఆకాశంలో షికారు చేసెను
అయినా మనిషి మారలేదు
ఆతని కాంక్ష తీరలేదు

చరణం::2

పిడికిలి మించని హృదయములో
కడలిని మించిన ఆశలు దాచెను
పిడికిలి మించని హృదయములో
కడలిని మించిన ఆశలు దాచెను

వేదికలెక్కెను..వాదము చేసెను
వేదికలెక్కెను..వాదము చేసెను
త్యాగమె మేలని బోధలు చేసెను

అయినా మనిషి మారలేదు
ఆతని బాధ తీరలేదు

వేషమూ మార్చెను..భాషనూ మార్చెను
మోసము నేర్చెను..తలలే మార్చెను
అయినా మనిషి మారలేదు..ఆతని మమత తీరలేదు
ఆ ఆ హహాహహ ఆహహ ఆహహహా..
ఓ..ఒహో ఓహోహో..ఓహో..మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్

No comments: