Monday, September 17, 2012

గుండమ్మ కథ--1962



సంగీతం::ఘంటసాల
రచన::పింగళి నాగేంద్ర రావు
గానం::ఘంటసాల,P.సుశీల

తారాగణం::N.T.రామారావు,అక్కినేని,జమున,సావత్రి,S.V.రంగారావు,రాజనాల,రమణారెడ్డి,L.విజయలక్ష్మి,
హరనాధ్, ఛాయాదేవి.
పల్లవి::

మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్
మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్

యెంత హాయి
యెంత హాయి ఈ రేయి
యెంత మధురమిహాయి
ఆఆఅఆఆఅఆఆఅ

యెంత హాయి ఈ రేయి
యెంత మధురమిహాయి
చందమామ చల్లగా
మత్తుమందు జల్లగా
ఆఆ చందమామ చల్లగా
పన్నిటి ఝల్లు జల్లగా
యెంత హాయి..
యెంత హాయి ఈ రేయి
యెంత మధురమిహాయి
యెంత హాయి...

చరణం::1

ఆఆఅఆఆఅఆఆఅ
ఒకరి చూపులొకరి పైన
విరి చూపులు విసరగా
ఆఆఆఆఆఆఅఆఆఅఆఆఅ
ఒకరి చూపులొకరి పైన
విరి తావులు వీచగా
విరితావుల ఒరవడిలో
విరహ మతిసయింపగా
ఆ విరితావుల ఘుమ ఘుమలో
మేను పరవసింపగా
యెంత హాయి..
యెంత హాయి ఈ రేయి
యెంత మధురమిహాయి..యెంత హాయి

చరణం::2

ఆఆఆఆఆఆఅఆఆఅఆఆఅ
కానరాని కోయిలలు
మనల మేలుకొలుపగా
కానరాని కోయిలలు
మనకు జోల పాడగా
మధురభావ లాహిరిలో
మనము తులిపోవగా
ఆఆ మధురభావ లహరిలో
మనము తేలిపోవగా..యెంత హాయి

యెంత హాయి ఈ రేయి
యెంత మధురమిహాయి
చందమామ చల్లగా
మత్తుమందు జల్లగా
యెంత హాయి..
యెంత హాయి ఈ రేయి

No comments: