Monday, September 17, 2012

మదన కామరాజు కథ--1962::యదుకుల కాంభోజి::రాగం





సంగీతం::రాజన్ నాగేంద్ర
రచన::G.కృష్ణమూర్తి
గానం::P.B.శ్రీనివాస్
యదుకుల కాంభోజి::రాగం


పల్లవి::


నీలి మేఘమాలవో నీలాలతారవో
నీ సోయగాలతో మదినీ దోచిపోదువో
నీలి మేఘమాలవో నీలాలతారవో
నీ సోయగాలతో మదినీ దోచిపోదువో
నీలి మేఘమాలవో..

చరణం::1

నీ మోములోన జాబిలి..దోబూచులాడెనే
నీ కురులు తేలి గాలిలో..ఉయ్యాలలూగెనే
నిదురించు వలపు మేల్కొలిపి..దాగిపోదువో
నీలి మేఘమాలవో..

చరణం::2

నీ కెంపు పెదవి తీయని..కమనీయ కావ్యమే
నీ వలపు తనివి తీరని..మధురాల రావమే
నిలచేవదేల నా పిలుపు..ఆలకించవో
నీలి మేఘమాలవో..

చరణం::3

రాదేల జాలి ఓచెలీ..ఈ మౌనమేలనే
రాగాల తేలిపోదమే..జాగేలచాలునే
రావో..యుగాల ప్రేయసి
నన్నాదరించవో

నీలి మేఘమాలవో నీలాలతారవో
నీ సోయగాలతో మదినీ దోచిపోదువో

No comments: