Monday, February 21, 2011

అమరదీపం--1977::ఖమాస్::రాగం



సంగీతం::చెళ్ళపిళ్ళ సత్యం 
రచన::వేటూరి,
గానం::V.రామకృష్ణ, P.సుశీల
ఖమాస్::రాగం  పల్లవి::

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ 
నా జీవన సంధ్యా సమయంలో
ఒక దేవత ఉదయించింది
ఆ రూపమే అపురూపమై
అమరదీపమై వెలిగింది

నా జీవన సంధ్యా సమయంలో
ఒక దేవత ఉదయించింది

చరణం::1

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ

శిలయె కదలిక రాగా..శిల్పమే కదలి ఆడింది

గరిసా సదపమా గమద మదని 
దనిరిని గరిగరిసా సదసదపా మపగా

కళకే కళగా విరిసి..నా కల నిజమై పండింది
శిలయె కదలిక రాగా..శిల్పమే కదలి ఆడింది
కళకే కళగా విరిసి..నా కల నిజమై పండింది
ఆరు ఋతువుల ఆమని కోయిల..మనసే ఎగసి పాడింది

నా జీవన సంధ్యా సమయంలో
ఒక దేవత ఉదయించింది

చరణం::2

పొద్దుపొదుపులో..అరుణిమలే
చెలి దిద్దు తిలకమై..చివురించే
ఇంద్రధనుస్సులో..రిమజిమలే
చెలి పైట జిలుగులే..సవరించే
ఆ చల్లని చూపుల..ఊపిరి సోకిన
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ 
ఆ చల్లని చూపుల..ఊపిరి సోకిన
వెదురు వేణువై పలికింది

నా జీవన సంధ్యా సమయంలో
ఒక దేవత ఉదయించింది

చరణం::3

పలుకే పాడని పాట..చిరునవ్వు పూలకే పూత

గరిసా సదపమా గమద మదని 
దనిరిని గరిగరిసా సదసదపా మపగా

నడకే నెమలికి ఆట..లే నడుము కలలకే కవ్వింత
కలలుగన్న నా శ్రీమతి రాగా..ఈ బ్రతుకే పరిమళించింది

నా జీవన సంధ్యా సమయంలో
ఒక దేవత ఉదయించింది
ఆ రూపమే అపురూపమై
అమరదీపమై వెలిగింది
నా జీవన సంధ్యా సమయంలో
ఒక దేవత ఉదయించింది

No comments: