Monday, February 21, 2011

అమరశిల్పి జక్కన్న--1964::నటభైరవి::రాగం



సంగీతం::సాలూరి రాజేశ్వర రావు
రచన::దాశరథి
గానం::ఘంటసాల
తారాగణం::అక్కినేని,బి.సరోజాదేవి,నాగయ్య,హరనాధ్,గిరిజ,రేలంగి,ధూళీపాళ
నటభైరవి::రాగం  పల్లవి::

ఎచటికోయీ నీ పయనం
ఏమిటోయి ఈ వైనం
ఏలనోయి ఈ ఘోరం
ఎవరిపైన నీ వైరం
మధురమైన జీవితాల కథ ఇంతేనా
ప్రేమికులకు విధి యొసగిన వరమింతేనా
మధురమైన జీవితాల కథ ఇంతేనా

చరణం::1

నిను నమ్మిన నీ సతినే నమ్మలేక పోయావా
శిలలను కరిగించు నీ వు శిలవే అయి పోయావా
మధుర మైన జీవితాల కథ ఇంతేనా

చరణం::2

వెన్నలతో విందు చేయు పున్నమి చంద్రుడవు నీవు
కళలు మాసి కాంతి బాసి గ్రహణం పాలైనావా
మధురమైన జీవితాల కథ ఇంతేనా

విరబూసిన చెట్టులాగ మురిసిపోవు నీ బ్రతుకే
వాడి మాడి మోడుబారి వన్నె మాసి పోయిందా
ఎచటి కోయి నీ పయనం
ఏమిటోయి ఈ వైనం
ఏలనోయి ఈ ఘోరం
ఎవరి పైన నీ వైరం

No comments: