Showing posts with label అమరదీపం--1977. Show all posts
Showing posts with label అమరదీపం--1977. Show all posts

Tuesday, November 29, 2011

అమరదీపం--1977::శుభపంతువరాళి::రాగం



చిమ్మలోని ఒక ఆణిముత్యం వినండి

సంగీతం::మాధవపెద్ది సత్యం
రచన::ఆచార్య ఆత్రేయ
గానం::SP.బాలు,P.సుశీల
దర్శకత్వం::కే.రాఘవేంద్రరావు బీ.ఎ.
నటీ,నటులు::కృష్ణంరాజు,జయసుథ,మురళీమోహన్


శుభపంతువరాళి::రాగం 


జయసుధ::

ఏ రాగమో ఇది ఏ తాళమో
ఏ రాగమో ఇది ఏ తాళమో
అనురాగాని కనువైన శృతికలిపినాము
ఆహా..ఊహూ..ఆహా..ఉహూ

మురళీమోహన్::
ఏ రాగమో ఇది ఏ తాళమో
ఏ రాగమో ఇది ఏ తాళమో
మనకళ్యాణ శుభవేళ మోగించు మేళమో
ఏ రాగమో..ఇది ఏ తాళమో

చరణం::1

మురళీమోహన్::
ఎదలో మెదిలే సంగతులన్నీ
పలికెను సంగీతమై..పలికెను సంగీతమై

జయసుధ::
కలిసిన కన్నుల మెరిసేకలలే
వెలిసెను గమకములై వెలిసెను గమకములై

మురళీమోహన్::
హోయలైన నడకలే లయలైనవవవి

జయసుధ::
చతురాడు నవ్వులే గతులైనవి

మురళీమోహన్::
సరిసరి అనగానె మరిమరి కొసరాడు

ఇద్దరు::
మురిపాలె మనజంట స్వరమైనది

జయసుధ::
ఏ రాగమో ఇది ఏ తాళమో

మురళీమోహన్::
మనకళ్యాణ శుభవేళ మోగించు మేళమో
ఏ రాగమో..

జయసుధ::
ఇది ఏ తాళమో

చరణం::2

జయసుధ::
విరికన్నె తనకు పరువమెకాదు
పరువూ కలదన్నది పరువు కలదన్నది

మురళీమోహన్::
భ్రమరము తనకు అనుభవమెకాదు
అనుబంధమున్నది అనుబంధమున్నది

జయసుధ::
కోకిలమ్మ గుండెకు గొంతున్నది

మురళీమోహన్::
కొమ్మలో..లో..దానికి గూడున్నది

జయసుధ::
సరిమగవానికి సగమని తలపోయు

ఇద్దరు::మనజంటకే జంటసరి ఉన్నది

మురళీమోహన్::
ఏ రాగమో ఇది ఏ తాళమో

జయసుధ::
అనురాగాని కనువైన శృతికలిపినాము..ఏ రాగమో

మురళీమోహన్::
ఇది ఏ తాళమో..

Monday, February 21, 2011

అమరదీపం--1977::ఖమాస్::రాగం



సంగీతం::చెళ్ళపిళ్ళ సత్యం 
రచన::వేటూరి,
గానం::V.రామకృష్ణ, P.సుశీల
ఖమాస్::రాగం  పల్లవి::

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ 
నా జీవన సంధ్యా సమయంలో
ఒక దేవత ఉదయించింది
ఆ రూపమే అపురూపమై
అమరదీపమై వెలిగింది

నా జీవన సంధ్యా సమయంలో
ఒక దేవత ఉదయించింది

చరణం::1

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ

శిలయె కదలిక రాగా..శిల్పమే కదలి ఆడింది

గరిసా సదపమా గమద మదని 
దనిరిని గరిగరిసా సదసదపా మపగా

కళకే కళగా విరిసి..నా కల నిజమై పండింది
శిలయె కదలిక రాగా..శిల్పమే కదలి ఆడింది
కళకే కళగా విరిసి..నా కల నిజమై పండింది
ఆరు ఋతువుల ఆమని కోయిల..మనసే ఎగసి పాడింది

నా జీవన సంధ్యా సమయంలో
ఒక దేవత ఉదయించింది

చరణం::2

పొద్దుపొదుపులో..అరుణిమలే
చెలి దిద్దు తిలకమై..చివురించే
ఇంద్రధనుస్సులో..రిమజిమలే
చెలి పైట జిలుగులే..సవరించే
ఆ చల్లని చూపుల..ఊపిరి సోకిన
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ 
ఆ చల్లని చూపుల..ఊపిరి సోకిన
వెదురు వేణువై పలికింది

నా జీవన సంధ్యా సమయంలో
ఒక దేవత ఉదయించింది

చరణం::3

పలుకే పాడని పాట..చిరునవ్వు పూలకే పూత

గరిసా సదపమా గమద మదని 
దనిరిని గరిగరిసా సదసదపా మపగా

నడకే నెమలికి ఆట..లే నడుము కలలకే కవ్వింత
కలలుగన్న నా శ్రీమతి రాగా..ఈ బ్రతుకే పరిమళించింది

నా జీవన సంధ్యా సమయంలో
ఒక దేవత ఉదయించింది
ఆ రూపమే అపురూపమై
అమరదీపమై వెలిగింది
నా జీవన సంధ్యా సమయంలో
ఒక దేవత ఉదయించింది