Saturday, November 26, 2011

పసివాడి పాణం--1987





సంగీతం::చక్రవర్తి
రచన::వేటూరి
గానం::SP.బాలు

సత్యం శివం సుందరం..నిత్యం ఇదే అనుభవం
సత్యం శివం సుందరం..నిత్యం ఇదే అనుభవం
సత్యం శివం సుందరం..నిత్యం ఇదే అనుభవం
మనసే ప్రధానము..దానికి మనిషే ప్రమాణము
సుఖమే కోరుకోరా..అది స్వార్థం కాదుపోరా
సత్యం శివం సుందరం..నిత్యం ఇదే అనుభవం

ఆ దేవుడు మస్తుగ తాగి..బొమ్మల్నే సృష్టి చేసి
అరే! గజిబిజి పడుతున్నాడు..తన తప్పే తనకు తెలిసి
ఓయ్..ఉన్నవాడిదే దోపిడి..లేనివాడికే రాపిడి
లోకం ఇట్టా ఏడ్చేరా..దీనిని ఎవ్వడూ మార్చురా
ప్రతి ఒక్కడు ఏమార్చురా..గుడి కెళ్ళినా గుణమేదిరా
ఉష్..తప్పై పోయిందిరో..క్షమించురో క్షమించు
నరుడా మందుకొట్టేవాడే..నీకు పరమ గురుడా
సత్యం శివం సుందరం..నిత్యం ఇదే అనుభవం

ఏ నాయకుడైన పాపం..వచ్చేది సేవ కోసం
అరె! కడుపులు వాడే కొడితే..అది కుర్చీలోని దోషం
రాజకీయాలెందుకు..తన్నుకు చచ్చేటందుకు
రాత్రీ పగలు తాగితే..రాజు బంటు ఒక్కటే
నా మాటలో నిజముందిరా..అది నమ్మితే సుఖముందిరా
వాదాలెందుకయ్య..మందు వేసేయ్ ముందు భయ్యా..

సత్యం శివం సుందరం..నిత్యం ఇదే అనుభవం
సత్యం శివం సుందరం..నిత్యం ఇదే అనుభవం
మనసే ప్రధానము..దానికి మనిషే ప్రమాణము
సుఖమే కోరుకోరా..అది స్వార్థం కాదుపోరా
సత్యం శివం సుందరం..నిత్యం ఇదే అనుభవం

No comments: