Saturday, November 26, 2011

చూడాలనివుంది--1998



చూడాలనివుంది 1998
సంగీతం::మణిశర్మ
రచన::వేటూరి
గానం::SP.బాలు,సుజాత

పల్లవి

అబ్బబ్బా ఇద్దూ అదిరేలా ఓ ముద్దు
అమ్మమ్మా దిద్దు మధురాలా మరుముద్దు
అబ్బబ్బా ఇద్దూ అదిరేలా ఓ ముద్దు
అమ్మమ్మా దిద్దు మధురాలా మరుముద్దు
చలిపులి పంజా విసిరితే సలసల కాగే వయసులో
గిలగిలలాడే సొగసుకే జోలాలీ
అబ్బబ్బా ఇద్దూ అదిరేలా ఓ ముద్దు
అమ్మమ్మా దిద్దు మధురాలా మరుముద్దు

చరణం::1

వాటేసుకో వదలకు వలపుల వల విసిరి
వాయించునీ మురళిని వయసుగాలి పోసి
దోచెయ్యనా దొరికితే దొరకని కోకసిరి
రాసేయ్యనా పాటలే పైటచాటు చూసి
ఎవరికి తెలియవు ఎద రస నసలు
పరువాలాటకు పానుపు పిలిచాకా
తనువు తాకిన తనివి తీరని వేళా
అబ్బబ్బా ఇద్దూ అదిరేలా ఓ ముద్దు
అమ్మమ్మా దిద్దు మధురాలా మరుముద్దు

చరణం::2

జాబిల్లితో జత కలు జగడపు రగడలతో
పొంకాలతో నిలు నిలు పొగడమాలలేసి
ఆకాశమే కులుకులు తొడిమెడు నడుమిదిగో
సూరీడునే పిలుపిలు చుక్కమంచు సోకి
అలకల చిలకలు చెలి రుసరుసలు
ఇక జాగెందుకు ఇరుకున పడిపోకా
మనసు తీరినా వయసులారని వేళా

అబ్బబ్బా ఇద్దూ అదిరేలా ఓ ముద్దు
అమ్మమ్మా దిద్దు మధురాలా మరుముద్దు
చలిపులి పంజా విసిరితే సలసల కాగే వయసులో
గిలగిలలాడే సొగసుకే జో లాలీ
అబ్బబ్బా ఇద్దూ అదిరేలా ఓ ముద్దు
అమ్మమ్మా దిద్దు మధురాలా మరుముద్దు

No comments: