Thursday, September 15, 2011

ప్రేమించి చూడు--1965




సంగీతం::మాష్టర్‌వేణు
రచన::ఆరుద్ర,ముళ్ళపూడి,C.నారాయణరెడ్డి
గానం::ఘటసాల


ప్రేమించు చూడు పిల్లా పెళ్ళాడుదాము మళ్ళా
ప్రేమించు చూడు పిల్లా పెళ్ళాడుదాము మళ్ళా
వయసున్న నాడు ఇలా దొరకలేదొకపిల్లా..
ప్రేమించు చూడుపిల్లా..ఆ ఆ ఆ ఆ ఆ

పట్టెమంచమెక్కలేదే..పాలు పళ్ళు మెక్కలేదే..
నిన్ను చూసేదాకా..ప్రేమంటే తెలియలేదు
నిన్ను చూసేదాకా..ప్రేమంటే తెలియలేదు
ప్రేమంటే తెలియలేదు

ప్రేమించు చూడు పిల్లోయ్..పెళ్ళాడుదాము మళ్ళా

ముగ్గు బుట్టాయే తల..ముడతపడే ముఖము ఇలా
ముగ్గు బుట్టాయే తల..ముడతపడే ముఖము ఇలా
పొద్దువాలిపోయే వేళ..పట్టు కుదిరేనె పిల్లా
పట్టు కుదిరేనె పిల్లా

ప్రేమించు చూడు పిల్లోయ్..పెళ్ళాడుదాము మళ్ళా

కాయలో రుచిలేదే..పండులో పసలేదే..
దుక్కవలే దేహమున్నా..లెక్కేమె వయసైనా
లెక్కేమె వయసైనా..
అత్తగారి పోరులేదు మామగారి అదుపులేదు
అత్తగారి పోరులేదు మామగారి అదుపులేదు
ముసలాడే మొగుడైతే మురిపాలకు కొదువలేదు
మురిపాలకు కొదవ లేదు

ప్రేమించు చూడు పిల్లా..ఆ ఆ ఆ ఆ ఆ

గడ్డాన్ని చూచి ఇంతా..కంగారు ఏల వింతా
పైపైన చూడవద్దు..నాలోన మెరుగు కద్దూ..
పైపైన చూడవద్దు..నాలోన మెరుగు కద్దూ..
నాలోన మెరుగు కద్దూ..

మనసైన సోకుకాడే వయసున్న కుర్రవాడే..
మనసైన సోకుకాడే వయసున్న కుర్రవాడే..
సరీఇన జోడు వీడే..మనువాడి చూదు నేడె
సరీఇన జోడు వీడే..మనువాడి చూదు నేడె
మనసైన సోకుకాడే వయసున్న కుర్రవాడే..
లల్లాలి లాలలలా లల్లాలి లాలలలా...

1 comment:

smartkram said...

ప్రేమించి చూడు చిత్రంలోని అన్నీ వీడియో పాటలను ఇక్కడ వీక్షించండి:

https://www.youtube.com/playlist?list=PLMWZNMZrl8xddtNS-YMHgmwrX3ZBpTYkV

ధన్యవాదాలు.