సంగీతం::సాలిల్ చౌదరి
రచన::ఆరుద్ర
గానం::SP.బాలు,P.సుశీల
మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్
నయనాలు కలిసె తొలిసారీ
హృదయాలు కరిగె మలిసారి
తలపే తరంగాలూరీ
పులకించె మేను ప్రతిసారి
నయనాలు కలిసె తొలిసారీ
హృదయాలు కరిగె మలిసారి
తలపే తరంగాలూరీ
పులకించె మేను ప్రతిసారి
లాలలాలాలలాలలలలా ఆహా హా
నాలోనా..నీపేరే..
పాడేనూ రాగాలూ
నాలోనా..నీరూపే
చేసేనూ..చిత్రాలే
మదిలో పదేపదేపదే ధ్వనించే
మమతలతోటలలోనా
తొలివలపులు పూవులు పూచే
నయనాలు కలిసె తొలిసారీ
హృదయాలు కరిగె మలిసారి
తలపే తరంగాలూరీ
పులకించె మేను ప్రతిసారి
నీలాలా..మేఘాలా
నీవేమో..ఎగిరేవూ
దూరానా..తీరానా
నీవేమో..నిలిచేవూ
కలలే ఇదే ఇలా ఇలా నిజమాయే
పరువము బంధము వేసే
మన ప్రణయము బాసలు చేసే
నయనాలు కలిసె తొలిసారీ
హృదయాలు కరిగె మలిసారి
తలపే తరంగాలూరీ
పులకించె మేను ప్రతిసారి
No comments:
Post a Comment