సంగీతం::మాష్టర్‌వేణు
రచన::ఆరుద్ర
గానం::PB.శ్రీనివాస్
మీ అందాల చేతులు కందేను పాపం ఎందుకు ఈ బెడద
సాయమువలదా..హోయ్..ఓ చేయ్ వేసేదా..ఆ..ఆ..ఆ.
మీ అందాల చేతులు కందేను పాపం ఎందుకు ఈ బెడద
సాయమువలదా..హోయ్..ఓ చేయ్ వేసేదా
చిన్నారి మేను సన్నాని నడుము అల్లాడిపోవాలా..హోయ్..
ఉయ్యాలలూచే వయ్యారి చేతులుమోటారుతోలాలా
చిన్నారి మేను సన్నాని నడుము అల్లాడిపోవాలా..హోయ్..
ఉయ్యాలలూచే వయ్యారి చేతులుమోటారుతోలాలా
వింతైన సొంపు వన్నెలుతరిగి వాడిపోవాలా
ఇటు అప్టుడేటుగా టిప్పుటాపుగా అలసిపోవాలా..హోయ్
ఓ హో..హో..
మీ అందాల చేతులు కందేను పాపం ఎందుకు ఈ బెడద
సాయమువలదా..హోయ్..ఓ చేయ్ వేసేదా
కాలేజి చదువుల తేలేవుగాని కాసింత తగ్గాలి..హోయ్..
వేలాది వేల రూపాయలున్నా వినయము చూపాలీ
కాలేజి చదువుల తేలేవుగాని కాసింత తగ్గాలి..హోయ్..
వేలాది వేల రూపాయలున్నా వినయము చూపాలీ
మగవానితోడు వలదన్న వనిత మహిలోన కనరాదు
ఈ కోపమెందుకూ..తాపమెందుకూ..తగునా ఇదినీకూ..హోయ్
ఓ..హో..హో..
మీ అందాల చేతులు కందేను పాపం ఎందుకు ఈ బెడద
సాయమువలదా..హోయ్..ఓ చేయ్ వేసేదా
కడగంటి చూపు కబురంపగానే శుభలేఖపంపేను..హోయ్..
విడిదింటినుండి ఊరేగి నిన్నే పెళ్ళడవస్తాను
కడగంటి చూపు కబురంపగానే శుభలేఖపంపేను..హోయ్..
విడిదింటినుండి ఊరేగి నిన్నే పెళ్ళడవస్తాను
మనసైనవాణ్ణి మా మా అనగానే పోంగేను
ఈ మనసైనవాణ్ణి మా మా అనగానే పోంగేను
ఇక వలపుదారిలో కలికి సేవలో కాలం గడిపేనూ..హోయ్..
ఓ..హో..హో..
మీ అందాల చేతులు కందేను పాపం ఎందుకు ఈ బెడద
సాయమువలదా..హోయ్..ఓ చేయ్ వేసేదా
No comments:
Post a Comment