సంగీతం::T.చలపతిరావు
రచన::D.C. నారాయణరెడ్డి
గానం::P.సుశీల బృందం
తారాగణం::అక్కినేని, లక్ష్మి, నాగభూషణం, రాజబాబు,రమాప్రభ,శుభ
పల్లవి::
ఎటు చూసినా..అందమే
ఎటు చూసినా..ఆనందమే
చూసే కళ్ళకు..మనసుంటే
ఆ మనసుకు కూడా..కళ్ళుంటే
ఎటు చూసినా..అందమే
ఎటు చూసినా..ఆనందమే
చరణం::1
హహహ హహహ హహహహ్హా
ఒహొహొ ఒహొహొ ఒహొహొహూ
ప్రతి సెలయేరూ..యయయాయయా
గోదావరిలా..జుజుజుజూజుజు
ఈయ్యా..ప్రతి సెలయేరూ..గోదావరిలా
హాయ్..పొంగిపోతుంది
ప్రతి గరిక పూవు..మందారంలా
ప్రతి గరిక పూవు..మందారంలా
విరబూస్తుంది..విరబూస్తుంది
ఎటు చూసినా..అందమే
ఎటు చూసినా..ఆనందమే
చూసే కళ్ళకు..మనసుంటే
ఆ మనసుకు కూడా..కళ్ళుంటే
ఎటు చూసినా..అందమే
ఎటు చూసినా..ఆనందమే
చరణం::2
హహహ హహహ హహహహ్హా
ఒహొహొ ఒహొహొ ఒహొహొహూ
ఈ...య్యా..
ప్రతి చిరునవ్వు..యయయాయయా
ఒక పున్నమిలా..జుజుజుజూజుజు
ప్రతి చిరునవ్వు..ఒక పున్నమిలా
హాయ్..మెరిసిపోతుంది
ప్రతి వలపు చూపు..గుండెలను మీటి
ప్రతి వలపు చూపు..గుండెలను మీటి
కధలెన్నెన్నో..చెబుతుంది
ఎటు చూసినా..అందమే
ఎటు చూసినా..ఆనందమే
చూసే కళ్ళకు..మనసుంటే..అహా
ఆ మనసుకు కూడా..కళ్ళుంటే
ఎటు చూసినా..అందమే
ఎటు చూసినా..ఆనందమే
చరణం::3
య్య్య..హో..ఈ..య్యా..హహహహ
ప్రతి కన్నియ వయసు..యయయాయయా
బిగి కౌగిలికోసం..జుజుజుజూజుజు
ప్రతి కన్నియ వయసు
కౌగిలికోసం..కలవరిస్తూంది
ప్రతి లేత పెదవి..మధుపాత్రలాగ
ప్రతి లేత పెదవి..మధుపాత్రలాగ
రుచులేవేవో..అందిస్తుంది
ఎటు చూసినా..అందమే
ఎటు చూసినా..ఆనందమే
No comments:
Post a Comment