సంగీతం::T.చలపతిరావు
రచన::ఆరుద్ర
గానం::ఘంటసాల , బృందం
తారాగణం::అక్కినేని, లక్ష్మి, నాగభూషణం, రాజబాబు,రమాప్రభ,శుభ
పల్లవి::
మురిపించే గువ్వల్లారా
ముద్దు ముద్దు ముద్దు..గుమ్మల్లారా
చెప్పనా చెప్పనా..చెప్పనా చెప్పనా
చెవిలో చిన్నమాట..ఎంతో మంచిమాట
చరణం::1
హెయ్ హె హె హె హేయ్
ఆడది ఎప్పుడు బానిస..కాదు
ఆమెకు ఇల్లొక ఖైదు..కాదు కాదు
దట్స్ రైట్
ఆడది ఎప్పుడు బానిస..కాదు
ఆమెకు ఇల్లొక ఖైదు..కాదు
అర్థంలేని ఆచారాలూ..యింకా
యింకా సాగాలా ?..నో..నో
ఇదే ఈనాటినిజం..ఇదే మనకు సమ్మతం
ఇదే ఈనాటినిజం..ఇదే మనకు సమ్మతం
మురిపించే..గువ్వల్లారా
ముద్దు ముద్దు ముద్దు..గుమ్మల్లారా
చెప్పనా చెప్పనా..చెప్పనా చెప్పనా
చెవిలో చిన్నమాట..ఎంతో మంచిమాట
చరణం::2
మెడలో ఎందుకు..తాళి?
దానికి వెలువే..ఖాళీ
వాట్ డూ యూ సే డార్లింగ్ ?
మెడలో ఎందుకు..తాళి?
దానికి వెలువే..ఖాళీ
మంగళసూత్రం మగాళ్ళకేస్తే..ఏలాగ వుంటుంది ?
ఇదే ఈ నాటినిజం..ఇదే సరికొత్త మతం
ఇదే ఈ నాటినిజం..ఇదే సరికొత్త మతం
మురిపించే..గువ్వల్లారా..ఆ..హాహాహాహా
ముద్దు ముద్దు ముద్దు..గుమ్మల్లారా..ఓ..హోహోహోహో
చెప్పనా..హా..చెప్పనా..హాచెప్పనా..ఓహో..చెప్పనా..ఓహో
చెవిలో చిన్నమాట..ఎంతో మంచిమాట
చరణం::3
హెయ్ హె హె హె హేయ్
పెళ్ళికి ప్రేమ పునాది..కాదు
ప్రేమకు పెళ్ళి జవాబు..కాదు కాదు
దట్స్ గుడ్
పెళ్ళికి ప్రేమ పునాది..కాదు
ప్రేమకు పెళ్ళి జవాబు..కాదు
విడాకులైనా..వివాహమైనా
ఖాతరుచెయ్యాలా..నో..నో..నో
ఇదే ఈ..నాటినిజం
యిదే మనకు..సమ్మతం
ఇదే ఈ..నాటినిజం
యిదే మనకు..సమ్మతం
మురిపించే..గువ్వల్లారా..ఆ..హాహాహాహా
ముద్దు ముద్దు ముద్దు..గుమ్మల్లారా..ఓ..హోహోహోహో
చెప్పనా..హా..చెప్పనా..హాచెప్పనా..ఓహో..చెప్పనా..ఓహో
చెవిలో చిన్నమాట..ఎంతో మంచిమాట
No comments:
Post a Comment