Saturday, September 18, 2010

పల్లెటూరి బావ--1973

























సంగీతం::T.చలపతిరావు
రచన::ఆత్రేయ
గానం::ఘంటసాల
తారాగణం::అక్కినేని, లక్ష్మి, నాగభూషణం, రాజబాబు,రమాప్రభ,శుభ

పల్లవి::

ఒసే వయ్యరి రంగీ..నా మనసే కుంగీ
పాడిందే కన్నీటి..పాట
నా ఆశలారి..నా రాత మారి 
అయ్యిందే నా బతుకు..బొమ్మలాట

చరణం::1

ఆ నాటి మా పెళ్ళీ..మేళాలే 
నేడు వినిపించే నాలోని..వేదనలు
కన్నాను ఎన్నెన్నో..తీయని కలలు
అవి కరిగి కురిసేను..కాన్నీళ్ళు 
మూణ్ణాళ్ళు చేశాను..కాపురము 
మూణ్ణాళ్ళు చేశాను..కాపురము 
మోశాను తీరని..అవమానము
నా మనసు..నా మమత తెగదెంచి
ఓ రంగమ్మా వెళ్ళిందే..యిల్లాలు
వెళ్ళిపోయిందే..యిల్లాలు 
          
ఒసే వయ్యరి రంగీ..నా మనసే కుంగీ
పాడిందే కన్నీటి..పాట
నా ఆశలారి..నా రాత మారి
అయ్యిందే నా బతుకు..బొమ్మలాట

చరణం::2

నా కంటి వెలుగై..వచ్చినది
నా యిల్లు చీకటి..చేసినది
కట్టిన తాళినే..కాదన్నది
తన కడుపున..నన్నే మోస్తున్నది
ముగిసిందిలే ఒక..వూరేగింపూ
ముగిసిందిలే ఒక..వూరేగింపూ
ఇక మిగిలింది ఒక్కటే..తుది పిలుపూ 
నా యిల్లు..నా కళ్ళు..వెలివేసి
ఓ రంగమ్మా వెళ్ళిందే..యిల్లాలు
వెళ్ళిపోయిందే..యిల్లాలు  
      
ఒసే వయ్యరి రంగీ..నా మనసే కుంగీ
పాడిందే కన్నీటి పాట
నా ఆశలారి..నా రాత మారి
అయ్యిందే నా బతుకు బొమ్మలాట

No comments: