సంగీతం::T.చలపతిరావు
రచన::కొసరాజు రాఘవయ్య
గానం::S.P.బాలు,బృందం
తారాగణం::అక్కినేని,లక్ష్మి,నాగభూషణం,రాజబాబు,రమాప్రభ,శుభ
పల్లవి::
శరభ శరభా..దశ్శరభ శరభ
అశ్శరభ దశ్శరభ ఆదుకోవయ్యా
శరభ శరభా..దశ్శరభ శరభ
అశ్శరభ దశ్శరభ ఆదుకోవయ్యా
తల్లివైనా నీవే శరభా..దశ్శరభ
తండ్రివైనా నీవే శరభా..అశ్శరభ
తల్లివైనా నీవే శరభా..ఆ..
తండ్రివైనా నీవే శరభా..అశ్శరభ
భద్రుడవు రుద్రుడవు..కరుణా సముద్రుడవు
దయచూసి కాపాడు దైవమైనా నీవే
శరభ శరభా..దశ్శరభ శరభ
అశ్శరభ దశ్శరభ ఆదుకోవయ్యా
చరణం::1
గుళ్ళు మింగేవాణ్ణి కాను..దశ్శరభ
కొంపలార్చే వాణ్ణి కాను..అశ్శరభ
నమ్మివచ్చిన వాళ్ళ ముంచను..దశ్శరభ
నడినెత్తిపై చెయ్యి వుంచను..దశ్శరభ
ప్రజల సొమ్మంతాను..ఫలహారముగ..మేసి
పెత్తనం చేసేటి..పెద్దమనిషిని..కాను
శరభ శరభా..దశ్శరభ శరభ
అశ్శరభ దశ్శరభ..ఆదుకోవయ్యా
చరణం::2
వట్టిమాటలు కట్టి పెట్టాలి..శరభ
తిండిదొంగల ఏరి పెట్టాలి..శరభ
వట్టిమాటలు కట్టి పెట్టలి..శరభ
తిండిదొంగల ఏరి పెట్టాలి..శరభ
లంచగొండుల..మట్టు పెట్టాలి
నల్లడబ్బును...బైటపెట్టాలి
రాజకీయాలలో..రంగులను మార్చేసి
జేబు నింపేవాళ్ళ..దుయ్యబట్టాలి
శరభ శరభా..దశ్శరభ శరభా
అశ్శరభ దశ్శరభ..ఆదుకోవయ్యా
చరణం::3
తెలుగు బిడ్డగ నేను..పుట్టాను..హ్హా
తెలుగు గడ్డకు పేరుతెస్తాను..ఆహ్హా హ్హా
తెలుగు బిడ్డగ నేను పుట్టాను..శరభ
తెలుగు గడ్డకు పేరుతెస్తాను..శరభ
అన్యాయమును..కాలరాస్తాను
ఆకతాయిల..తిత్తి తీస్తాను
ఆకలో యని ఎపుడూ..అలమటించే వారి
అండ దండగ నేను..వుంటాను
శరభ శరభా..దశ్శరభ శరభా
అశ్శరభ దశ్శరభ..ఆదుకోవయ్యా
శరభ శరభా..దశ్శరభ శరభా
అశ్శరభ దశ్శరభ..ఆదుకోవయ్యా
No comments:
Post a Comment