Saturday, September 18, 2010

పల్లెటూరి బావ--973

సంగీతం::T.చలపతిరావు
రచన::ఆత్రేయ
గానం::T.R.జయదేవ్,శరావతి 
తారాగణం::అక్కినేని,లక్ష్మి,నాగభూషణం,రాజబాబు,రమాప్రభ,శుభ

పల్లవి::

తెలివి ఒక్కడి సొమ్మంటే తెలివి తక్కువ దద్దమ్మా 
సొమ్ము మనదీ సోకు మనది..చూడవే ముద్దులగుమ్మా
చూడవే..ముద్దులగుమ్మా  

తెలివి ఒక్కడి సొమ్మంటే..తెలివి తక్కువ దద్దమ్మా
సొమ్ము మనదీ సోకు మనది..చూడవే ముద్దులగుమ్మా
చూడవే..ముద్దులగుమ్మా  

చరణం::1

సీలింగంటూ వచ్చిది..ఎన్నో చిక్కులలో పడవేశింది
సీలింగంటూ వచ్చిది..ఎన్నో చిక్కులలో పడవేశింది
విడాకు చక్రం అడ్డంవేసి..ఆలూ మగలం కాదన్నాం
ఆలూ మగలం..కాదన్నాం
అయినా మనకు కలసి వుండి..అయినా మనకు కలసి వుండి 
అందరినీ బురిడీ..కొట్టించాం

తెలివి ఒక్కడి సొమ్మంటే..తెలివి తక్కువ దద్దమ్మా
సొమ్ము మనదీ సోకు మనది..చూడవే ముద్దులగుమ్మా
చూడవే..ముద్దులగుమ్మా  

చరణం::2

ఒహో ఒహో..ఓఓఓఓ..ఏహే హే హే హే..ఓఓఓఓ 
బుర్ర బాగా పనిచేసింది..తిరుగులేని ప్లానేసింది 
బుర్ర బాగా పనిచేసింది..తిరుగులేని ప్లానేసింది 
సెంటు కూడా చెక్కు చెదరక..వున్న పొలమూ నిలిచింది
వున్న పొలమూ..నిలిచింది        
చెప్పరాని తెలివి వుందని..చెప్పరాని తెలివి వుందని 
యిప్పుడే..ఋజువయ్యింది
అదే మన పెతిభ..!!
తెలివి ఒక్కడి సొమ్మంటే..తెలివి తక్కువ దద్దమ్మా
సొమ్ము మనదీ సోకు మనది..చూడవే ముద్దులగుమ్మా
చూడవే..ముద్దులగుమ్మా  

చరణం::3

పొలాల కున్నది సీలింగు..యిళ్ళ స్థలాలకు న్నది సీలింగ్
ఒకటీ రెండు మూడు దాటితే..పిల్లల కున్నది సీలింగు 
ల్లల కున్నది..సీలింగు 
ప్రేమకు మాత్రం ఎవడుకూడా..ప్రేమకు మాత్రం ఎవడుకూడా
పెట్టలేదోయ్లిం..ఫీలింగు     
తెలివి ఒక్కడి సొమ్మంటే..తెలివి తక్కువ దద్దమ్మా 
సొమ్ము మనదీ సోకు..మనది చూడవే ముద్దులగుమ్మా
చూడవే ముద్దులగుమ్మా

No comments: