సంగీతం::సాలూరు రాజేశ్వరరావు
రచన::కొసరాజు రాఘవయ్య
గానం::S.P.బాలు
తారాగణం::కృష్ణ,భారతి,కృష్ణకుమారి,బాలయ్య,సత్యనారాయణ,పండరీబాయి,కాంతారావు
పల్లవి::
శ్రీ రామచంద్రకీ జై..జటకపటక జటకపటక
జటకపటక జటకపటక జటపట జటపట
పటేల్ పటేల్ కబగిబ గబగబ..ఆవో..హయ్య..తరరరరర
రాముని బంటునురా సీతారాముని బంటునురా..హోయ్
రాముని బంటునురా సీతారాముని బంటునురా
చరణం::1
దిక్కుల కాంతులు..పిక్కటిల్లగా..అహా..
దిక్కుల కాంతులు..పిక్కటిల్లగా
గుప్పున కన్నుల..నిప్పులు రాలగ..ఆయ్
గుప్పున కన్నుల..నిప్పులు రాలగ
బర బర బర బర అంబర వీధిని
వాలము దిప్పుచు వచ్చినానురా
రాముని బంటునురా..సీతారాముని బంటునురా..ఆయ్
రాముని బంటునురా..సీతకు రాముని బంటునురా
చరణం::2
ఇక్కడ వున్నాడొక రావణుడు..ఆయ్
ఇక్కడ వున్నాడొక రావణుడు
నక్కలాగ పొంచున్నాడు..ఊఊఊ
గుంటనక్కలాగ పొంచున్నాడు
వాడిని పట్టి నేలకు కొట్టి..వాడిని పట్టి నేలకు కొట్టి
కండలు కోసి గుండెలు చీల్చి..కాకుల కెగరేస్తాడు వీడు
రాముని బంటునురా..సీతారాముని బంటునురా హోయ్
రాముని బంటునురా..సీతకు..రఘురాముని బంటునురా
చరణం::3
పిచ్చివాడిని నేనురా మద పిచ్చివాడిని కానురా
ఆహహ..ఓహోహోహో..హోవ్..ఆహహహాహా..ఒయ్
పిచ్చివాడిని నేనురా మద పిచ్చివాడిని కానురా
చచ్చు పుచ్చు లోకానికి..చదువు చెప్పె వాడ్నిరా
ఆహహఒయ్ హోయ్..పచ్చపచ్చని కాపురాలకు చిచ్చుపెట్టేవాళ్ళ మెడకు
ఉచ్చులాంటి వాడ్నిరా కార్చిచ్చులాంటి వాడ్నిరా..తకతకిటతజను
రాముని బంటునురా సీతారాముని బంటునురా..హోయ్
రాముని బంటునురా సీతకు రాముని బంటునురా
చరణం::4
అమ్మా..ఆ..సీతమ్మా..ఆ..రాముడు పంపగ వచ్చానమ్మా
రఘురాముడు..పంపగ వచ్చానమ్మా
నీ కష్టాలన్నీ కడతేరే ఆ మంచిరోజు వచ్చేనమ్మా అమ్మా..సీతమ్మా
ఈ రక్కసి బాధల నుక్కడంప నీ రక్షణకై నే వచ్చానమ్మా
రాముని బంటునురా సీతారాముని బంటునురా..హోయ్
రాముని బంటునురా సీతకు రాముని బంటునురా
అహ..జయజయ రాముడు..జానకిరాముడు
కోదండరాముడు..పట్టాభి రాముడు
హోయ్..దశరధ రాముడు..తారకరాముడు
అయోధ్య రాముడు..అనంత రాముడు
రామ రామ రామ సీత రామ రామ రామ సీత
రామ రామ రామ సీత రామ రామ రామ సీత
రాముని బంటునురా సీతారాముని బంటునురా
రాముని బంటునురా సీతకు రాముని బంటునురా
No comments:
Post a Comment