సంగీతం::సాలూరు రాజేశ్వరరావు
రచన::గణపతిశాస్త్రి
గానం::P.సుశీల
తారాగణం::కృష్ణ,భారతి,కృష్ణకుమారి,బాలయ్య,సత్యనారాయణ,పండరీబాయి,కాంతారావు
పల్లవి::
రాజా..ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ..నా రాజా
వేశావు బలే వేషాలు చేశావులే తమాషాలు
వేశావు బలే వేషాలు చేశావులే తమాషాలు
తెలిసెనులే..ఏఏఏఏ..ఇక తెలిసెనులే..ఏఏఏ
వేశావు బలే వేషాలు చేశావులే తమాషాలు
వేశావు బలే వేషాలు చేశావులే తమాషాలు
చరణం::1
మింటి నడుమ జాబిల్లీ..ఏఏఏ..నీవే వంటయింటి కుందేలైనావే
మింటి నడుమ జాబిల్లీ..నీవే..ఏఏఏ..వంటయింటి కుందేలైనావే
మగసిరులొలికే మహరాజ..మగువల చేతలు తమకేల
మగసిరులొలికే మహరాజ..మగువల చేతలుతమకేల
పసందైన ఈ కోడె వయస్సులో..ఓఓఓఓఓ..హుషారులేదా
విషాదమేల..రాజా..ఆఆఆ..నా..రాజా
వేశావు బలే వేషాలు..చేశావులే తమాషాలు
వేశావు బలే వేషాలు..చేశావులే తమాషాలు
చరణం::2
ఉలకవు పలకవు పెదవి కదిపితే..వొలికిపోవునా వరహాలే
చీ..పో..
ఉలకవు పలకవు పెదవి కదిపితే..వొలికిపోవునా వరహాలే
ఒక్క మాటతో ఓరచూపుతో..ఒళ్ళు పులకరించేనే
నా..ఆ..గుండె..జలదరించేనే
బెట్టు చేయనేల..పట్టు విడచి రావా..లెక్కచేయవేల
అక్కున చేర్చుకోవా..రాజా..ఆఆఆ..నా..రాజా
వేశావు బలే వేషాలు..చేశావులే తమాషాలు
వేశావు బలే వేషాలు..చేశావులే తమాషాలు
